బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ మరోసారి నిజ జీవిత ఘటన ఆధారంగా సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు పై ఆయన దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ కేసులో ట్విస్టులు, టర్నులు అమీర్ ఖాన్ ని విపరీతంగా ఆకర్షించాయని తెలిసిందిబీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రాజా రఘు వంశీ అనే వ్యక్తి హత్య, దానికి సంబంధించిన అతని భార్య సోనమ్ పాత్రపై అనుమానాలు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో జరిగిన కుట్రల నేపథ్యాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించాలనే ఉద్దేశంతో అమీర్ ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై ఆయన అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Also Read : Prithviraj Sukumaran : కేరళవాడినైనా.. నేను భారతీయుడినే..
గతంలో ‘తలాష్’ వంటి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అమీర్, ఈసారి కూడా ప్రజల మనసుల్లో తడబడే కథతో వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక ఇటీవల వచ్చిన ‘సీతారే జమీన్ పర్’ మూవీ పై మంచి స్పందన వచ్చినా, కలెక్షన్స్ పరంగా ఆశించిన స్థాయిలో రాలేదు. ‘లాల్ సింగ్ చడ్డా’ అయితే ఆమిర్ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన మహాభారతం ప్రాజెక్ట్ పై కూడా దృష్టి పెట్టినట్లు టాక్. అంతేకాదు, రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హనీమూన్ హత్య కేసును తెరపై చూపిస్తే, అది దేశవ్యాప్తంగా భారీ చర్చను రేపే అవకాశం ఉంది. మరోసారి తన క్రైమ్ థ్రిల్లర్ ఇమేజ్‌ను తిరిగి తెచ్చుకోబోతున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది.