Ponguleti Srinivasa Reddy: ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పూర్తి చేసే బాధ్యత నాదని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా గ్రామంలో గత ప్రభుత్వంలో అధికారులని బెదిరించారని తెలిపారు. రేషన్ కార్డు పొంది ఉంటే వారంతట వారే రద్దు చేసుకుంటే మంచిదన్నారు. బెదిరింపులకు పాల్పడి రేషన్ కార్డు లు పొందిన వారు రద్దు చేసుకోవాలని లేదంటే సీరియస్ గా వుంటుందన్నారు. ఒక సంవత్సరంలోపే పాలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామములో సీసీ రోడ్లు పూర్తిచేసే బాధ్యత నాదన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలల్లో అర్హులైన వారికి రేషన్ కార్డు ఇవ్వలేకపోయిందన్నారు. ప్రతి నిరుపేదకు సహాయం చేయాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం ఈ ప్రభుత్వ ఆలోచన అన్నారు. విద్య, వైద్య విషయంలో ఎవరైనా బహు పేద వాళ్ళ ఉంటే వారి కి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
Read also: NTR 31 : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరో బంపర్ న్యూస్.. ప్రశాంత్ నీల్ సినిమాపై బ్రేకింగ్ అప్డేట్..
ప్రతి గ్రామంలో ఐదుగురితో ఒక కమిటీ వేయడం జరుగుతుందన్నారు. ఆ కమిటీ వారి సూచనలు ఆలోచన మేరకే అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. విద్య వైద్య విషయంలో నిరుపేదలకి ఎవరికైనా ప్రభుత్వం నుంచి సహాయం అందకపోతే నా వ్యక్తిగతంగా వారికి ఎలా సహాయం చేయాలో అలా చేస్తానని తెలిపారు. మంత్రి పొంగులేటి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.. బాధితులను క్యాంపు కార్యాలయానికి తీసుకురావాల్సిన అవసరం లేకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. పాలేరు నియోజకవర్గంలోని గ్రామాలకు వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మొదటి దశలో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు పాలేరు నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించారు. నాలుగు మండలాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించారు.
Israel Gaza War : గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విధ్వంసం.. వైమానిక దాడిలో 27 మంది మృతి