Site icon NTV Telugu

Ponguleti: సమాధానం చెప్పే రోజు వస్తుంది.. పువ్వాడ పై బగ్గుమన్న పొంగులేటి..

Ponguleti , Puvvada

Ponguleti , Puvvada

Ponguleti: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతుంది. ఖమ్మంలో ఎస్.ఆర్ కాన్ వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పై మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాటలకు పొంగులేటి సటైర్‌ వేశారు. నీ అవక్కులకు చవాకులు సమాధానం వస్తోందని అన్నారు. నా చిరునవ్వే పువ్వాడ అజయ్ రాజకీయ సమాధి జరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. నందమూరి విగ్రహానికి పూలమాల వేస్తే పాలతో శుద్ది చేయిస్తవా? అంటూ మండిపడ్డారు. ఇది నీ సంస్కృతి నా? అని ప్రశ్నించారు. సమాధానం చెప్పే రోజు, ప్రజలు ఇస్తారు తీర్పు వస్తుందన్నారు. వడ్డీతో సహా మనం లాక్కొని తీసుకుని సమయం ఆసన్నం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు నేర్పిన రాజనీతి తో నాకు బలమైన దైర్యం వచ్చిందని అన్నారు. నేను ఒక్కడిని యుద్ధం చేయలేము.. అందరం కలసి యుద్ధం చేద్దామని తెలిపారు.

Read also: Tamilnadu: హైడ్రోజన్ ఫ్యూయల్ బోట్‌ను రూపొందించిన విద్యార్థులు

మనం అందరం యుద్ధం చేశామన్నారు. తండ్రితో సమానమని పార్టీలో చేరితే మనల్నే మోసం చేశారని మండిపడ్డారు. పార్టీ పదవి ఇవ్వక పోయినా తొందర పడలేదని అన్నారు. పదవి వుంటేనే ప్రజలలో వుండాలని అనుకునే వాడిని కాదని స్పష్టం చేశారు. ప్రజల అండ దండలు వుంటే ఎంత పెద్ద దానిని అయిన ఎదుర్కొంటామన్నారు. పదవి లేకపోవడం వల్లనే ఇంత మంది ప్రేమను పొందగలిగామన్నారు. రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్నానని, మూడు రోజుల్లోనే పార్టీ మార్పు వుంటుందని స్పష్టం చేశారు. మీరందరూ ఏమి కోరుకుంటున్నారో నాకు తెలుసు అని అన్నారు. ఎక్కువ సమయం తీసుకోనంటూ తెలిపారు. మూడు రోజుల్లోనే పార్టీ మార్పు వుంటుందన్నారు. ఖమ్మం నడిబొడ్డున పార్టీలో చేరుతానని అన్నారు. లక్షలాది మంది సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతానన్నారు. కేసీఆర్ పరిపాలన ను బొంద పెడతామన్నారు. మంచి పరిపాలన కోసము ప్రజాస్వామిక పార్టీలో చేరుతామన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలంటే మన వంటి మైండ్ వున్న వారిని సమికరించుకోవాలని అన్నారు. అందుకనే నిర్ణయం ఆలస్యం అయ్యిందని, చాలా మందితో చర్చలు జరిగాయని పొంగులేటి స్పష్టం చేశారు.
CM Jagan : సీఎం జగన్‌ను కలిసిన ఏపీ ఎన్జీవో నేతలు

Exit mobile version