Ponguleti: ఖజానాను ఖాళీ చేసి ఇచ్చారు.. అయినా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: ఖజానాను ఖాళీ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఇచ్చింది.. అయినా ఆరు గారింటీలను ఇస్తామని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏమిటి అనే దానిపై సమీక్ష జరుపలేదన్నారు. ఆనాడు తప్పులు చేసిన అధికారుల ను వేదింపులకు పాల్పడం ప్రజలను ఆనాటి ప్రభుత్వం విస్మరించిందన్నారు. తప్పులు చేసిన వారిని శిక్షించాలని అజెండా మాకు లేదన్నారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. మంచి అధికారులకు కీ పొజిషన్ వుంటుందన్నారు. గత ప్రభుత్వం వత్తిడి వల్ల అధికారులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కానీ పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. సిఎం రేవంత్ రెడ్డికి.. అధికారుల మీద రాజకీయ పార్టీల మీద ఏనాడూకక్ష్య సాధింపు లేదన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమించిన వాటిని బయటకు తీస్తామన్నారు.
Also Read
బినామీ కాంట్రాక్ట్ లని వచ్చిన వాటిపై సమీక్ష జరపాలి.. జరుపుతామన్నారు. ఇంకా అధికారం మత్తులో వున్నట్లుగా అహంకారంగా కొంతమంది వున్నారని తెలిపారు. వారిని ప్రజలు గమనిస్తున్నారని.. గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టిందని తెలిపారు. బీఆర్ఎస్ మాదిరిగా మాయమాటలు చెప్పడం మాకు సాధ్యం కాదన్నారు. మేము అలా చేయమని, ఆరు గ్యారెంటీలను సామాన్య ప్రజలకు అందిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రంలో వున్న మాట వాస్తవమన్నారు. కానీ గారెంటీలను అమలు చేస్తామన్నారు. ఖజానాను ఖాళీ చేసి మాకు ఇచ్చింది.. అయిన ఆరు గారింటీ లను ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఊరించదు.. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను సామాన్యులకు ఇచ్చే ఇళ్లను విడతల వారీగా ఇస్తామన్నారు. తెలంగాణలో ఇల్లు లేదు అనే మాట రాకుండా చూస్తామన్నారు.
Read also: CPI Narayana: సీపీఐ వల్లే కాంగ్రెస్ విజయం.. లోక్ సభకు పోటీచేస్తాం
ప్రతిపక్షాలు సహకరించక పోయిన పర్వాలేదన్నారు. కారు కూతలు కూయకండి.. కొద్ది నెలల ఓపిక పట్టండని తెలిపారు. ఏ వ్యక్తి, మాజీ మంత్రిని టార్గెట్ చేసుకోవడం కాదు వ్యవస్థ ను, ప్రభుత్వం సొమ్మును దోచుకున్న వారిని ఎవ్వరినీ క్షమించం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎంత పెద్ద నాయకుడు అయిన వదిలిపెట్టం అని స్పష్టత ఇచ్చారు. గ్రామ పంచాయతీలో కట్టుకున్న వాటిని రెగ్యులరైజేషన్ కోసం కమిటీ వేస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఇంకా డిసిషన్ తీసుకోలేదని అన్నారు. అయిదు గ్రామ పంచాయతీలపై ఆలోచిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి వుందన్నారు. రైతుబంధుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!