Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. శనివారం అర్ధరాత్రి సుమన్‌ను నాంపల్లి పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలిచారు. నిన్న మధ్యాహ్నం పోలీసులు తెలంగాణ భవన్లో సుమన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సింగరేణి కార్యాలయాలు, రైలు పట్టాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సింగరేణి అధికారులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నాంపల్లి పోలీసులు తెలిపారు. బాల్క సుమన్‌పై సెక్షన్స్ 326(g), 351(3), 353(1)(b), r/w 55, r/w 61(2)(a) BNS, 4 PDPPA యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ సింగరేణి ఆస్తులు ధ్వంసం చేయాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో వాదనలు విన్న అనంతరం బాల్క సుమన్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నాంపల్లి మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంది.
ఇక తన అరెస్ట్ అంశంపై ఇప్పటికే బాల్క సుమన్ స్పందించారు. తాను మాట్లాడుతున్నాను. ప్రశ్నిస్తున్నాను కాబట్టి తన గొంతు నొక్కాలే, అరెస్టు చేసి జైల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. “నిర్భందం విధించి తద్వారా పైశాచిక ఆనందం పొందాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్లో కనబడుతుంది. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే పని మీద దృష్టి పెట్టండి. ఇళ్ల పట్టాలు ఇవ్వండి. మూడేళ్లలో ఎవ్వరికీ ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. సింగరేణిలో రూ.15 వేల కోట్ల కుంభకోణం చేశారు. రూ.1600 కోట్ల విలువైన బొగ్గును మాయం చేశారు. సింగరేణిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు కావట్లేదు. కొత్త మైన్స్ లేవు. మా కార్మికులు గానీ, వారి కుటంబాలు గానీ ఆవేదన, ఆందోళన బాధతో ఉన్నారు. ఆ ప్రాంత ప్రతినిధిగా ఆ ప్రజల తరఫున మేం మాట్లాడుతున్నాం” అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యా్ఖ్యానించారు.
Also Read
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
-
CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
-
Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై స్టే ఎత్తివేత.. కానీ..!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!