Rashmika: ‘యానిమల్’లో రచ్చ లేపావ్.. రష్మికపై అమితాబ్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan praises Rashmika Mandanna’s stellar performance in Animal: కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అభిమానితో మాట్లాడింది. ఇక ఇదే క్రమంలో యానిమల్ సినిమాలో రష్మిక పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది అంటూ బిగ్ బి అమితాబ్ ప్రశంసలు కురిపించారు. రష్మిక మందన్న ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారి నేషనల్ క్రష్‌గా ఎదిగింది. అల్లు అర్జున్ “పుష్ప: ది రైజ్”లో ఆమె నటనతో నేషనల్ వైడ్ గుర్తింపు దక్కించుకోగా ఆమెకు విస్తృతమైన ప్రశంసలు లభించాయి. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, ఆమె “గుడ్‌బై”లో అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్‌ను పంచుకుంది, ఒక రకంగా ఆమెకు హిందీలో ది బెస్ట్ లాంచ్ అని చెప్పచ్చు. ఆ తరువాత ఆమె “మిషన్ మజ్ను”లో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మరోసారి రష్మిక తాజాగా విడుదలైన “యానిమల్”లో తన అసాధారణ నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ తన ‘గుడ్‌బై’ సహనటి రష్మిక మందన్న పై ప్రశంసల వర్షం కురిపించారు, ఇటీవల చిత్రం ‘యానిమల్’లో ఆమె అద్భుతమైన నటనను మెచ్చుకున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి 15 కార్యక్రమంలో సందడి చేసింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.
Animal: 9వ రోజు 60 కోట్లు కలెక్ట్ చేశాడా? అరాచకం అనేది కూడా చిన్న పదంలా ఉంది
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఈ క్రమంలో ఆమె అభిమాని మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కంటెస్టెంట్ ప్రమోద్ భాస్కర్ తో వీడియో కాల్ లో మాట్లాడింది. ప్రమోద్ భాస్కర్ అనే కంటెస్టెంట్ రష్మిక మందన్నకు పెద్ద అభిమాని, ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. ఇక ఇదే విషయాన్ని అమితాబ్ దృష్టికి తీసుకు వెళ్లగా అమితాబ్ అతనికి స్వీట్ షాక్ ఇచ్చారు. తన ఫేవరేట్ హీరోయిన్ వీడియో కాల్ లో మాట్లాడేసరికి ప్రమోద్ సర్ ప్రైజ్ అయ్యారు, ఆమెను ఎంతగానో అభిమానిస్తున్నాని, పర్సనల్ గా కలిసి మాట్లాడాలని ఉందని ప్రమోద్ అడగగా..రష్మిక కూడా తప్పకుండా మీట్ అవుదామని హామీ ఇచ్చింది. అలాగే ఆమె మాట్లాడుతూ తన ఫ్యాన్ అయిన ప్రమోద్ కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాంలో కంటెస్టెంట్ గా ముందుకు వెళ్లడం హ్యాపీగా ఉందని రష్మిక చెప్పుకొచ్చింది. అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ రష్మిక ప్రతి సినిమాను చూస్తున్నామని, ఇటీవల యానిమల్ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ ఎంతో ఆకట్టుకుంది అని అన్నారు, ఇక ప్రశంసల నేపథ్యంలో రష్మిక అమితాబ్ కు థ్యాంక్స్ చెప్పింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. తృప్తి డిమ్రీ, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ వంటి వారు కూడా నటించారు.
I feel like am literally living my dream moments right now still not able to believe that one day I will be on TV and will get a chance to talk with My Crush since 2016 @iamRashmika Ji Mam,I wish I will meet her in person one day. 1/2#JaiHoKBC pic.twitter.com/lLoiUdYQJ8
— Pramod Bhaske 🇮🇳 (@AlwaysPramod9) December 9, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!