Mega 156 : మెగాస్టార్ సరసన నటించనున్న ఆ సీనియర్ హీరోయిన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..అదే జోష్ లో మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ సినిమాలో నటించారు. కానీ ఊహించని విధంగా భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో మెగాస్టార్ తన తరువాత సినిమాను యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు. బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వశిష్ఠ తో మెగాస్టార్ తన 156 వ సినిమాను చేస్తున్నారు.. మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే.టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ పతాకంపై వంశీ,ప్రమోద్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీ షూటింగ్ ని మొదలెట్టారు. షూటింగ్ జరుగుతుండగానే ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు చిరంజీవి విరామం తీసుకుని హైదరాబాద్ కి వచ్చారు. ఓ సరికొత్త ఊహా ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. కాగా సినిమాలో చిరంజీవి సరసన పలువురు హీరోయిన్స్ ని మేకర్స్ ఇప్పటికే పరిశీలించారు. వారిలో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి మెగాస్టార్ సరసన ఫిక్స్ అయినట్లు గతంలో వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు మరో హీరోయిన్ త్రిష పేరు బయటకు వచ్చింది.ఈ సినిమా కోసం అనుష్క శెట్టి ఆశించిన స్థాయిలో బరువు తగ్గకపోవడంతో ఆ అవకాశం చెన్నై బ్యూటీ త్రిష కు దక్కినట్లు సమాచారం. త్రిష ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్ మరియు లియో వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తోంది. అయితే చాలా రోజుల నుంచి టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని త్రిష ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు మెగాస్టార్ సినిమాతో త్రిషకి ఆ అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చిరంజీవి స్వయంగా త్రిష పేరును మూవీ టీం కి రిఫర్ చేసినట్లు సమాచారం.. గతంలో చిరంజీవి, త్రిష కాంబినేషన్లో ‘స్టాలిన్’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.త్వరలోనే మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!