Ganja Selling: వీళ్లు అత్తాకోడళ్ళా.. యవ్వారం మమూలుగా లేదుగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja Selling: ఈ అత్తకోడళ్ల రోజువారీ సంపాదన రూ.30 వేలు. నెలకు రూ. 9 లక్షలు. వాళ్లు చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఉన్నత స్థాయి వ్యాపారం కాదు. పక్కాగా చెప్పాలంటే చీకటి దండా.. వీరిద్దిర యవ్వారం మామూలుగా లేదంటారా? వీరద్దరే కాదండోయ్ కుటుంబమంతా అక్రమ వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు ఈ అత్తాకోడళ్లు ఏం చేస్తున్నారంటే.. అక్రమంగా గంజాయిని విక్రయించి భారీగా ఆస్తులు సంపాదించారన్న మాట. ఎంతదాచిన దొంగ దొరక్కుండ ఉంటాడా.. చివరికి ఈ అత్తాకోడళ్ల భాగోతం బట్టబయలు కావడంతో కటకటాల వెనక్కొ వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా ఎక్కడో కాదండోయ్ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో చోటుచేసుకుంది.
Read also: Top Headlines @1PM : టాప్ న్యూస్
Also Read
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
నానక్రామ్గూడ లోధా బస్తీకి చెందిన కాళపాటి గౌతమ్సింగ్, అతని తల్లి కాలాపాటి నీతూభాయ్, అతని కుటుంబానికి చెందిన మరో ఆరుగురు మధుబాయి కొన్నేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. నీతూభాయ్ కుటుంబ సభ్యులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉంటూ ఈ గంజాయి దందా చేస్తున్నారు. ధూల్పేటలో రూ. కిలో 8 వేలు.. 5 గ్రాముల ప్యాకెట్లను తయారు చేసి ఒక్కొక్కటి రూ. 250కి విక్రయిస్తున్నారు. ఇలా.. ఒక కేజీపై రూ. 50 వేలకు పైగానే ఈ ముఠా సంపాదిస్తోంది. నీతూబాయి , ఆమె కోడలు మధుబాయి కనీసం రూ. 30 వేల వరకు నెలకు రూ. 9 లక్షలు సంపాదించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గంజాయి దందా ద్వారా వచ్చిన డబ్బుతో రూ. 4 కోట్ల ఆస్తులు కూడబెట్టారు. నీతూబాయి లంగర్హౌస్, గచ్చిబౌలి ప్రాంతాల్లో మూడంతస్తుల భవనాలు, ఖరీదైన కార్లను కొనుగోలు చేసింది. మంగళవారం బాలుడితో పాటు గౌతమ్సింగ్ అనే వ్యక్తి గంజాయితో ప్రయాణిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో గోల్కొండ పోలీసులతో పాటు నార్కోటిక్స్ బ్యూరో సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ ఇద్దరిని విచారించగా నీతూభాయ్, మధుబాయిల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నీతుబాయి వద్ద రూ. 40.30 లక్షలు, 16 బ్యాంకు ఖాతాల్లోని రూ.1.53 కోట్ల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నీతూభాయ్పై పలు కేసులు నమోదు కాగా, ఆమెపై పీడీ యాక్ట్ కూడా ఉంది. ఆమె కొడుకుపై కూడా కేసులు ఉన్నాయి. అయినప్పటికీ, మార్గం మార్చుకోకుండా, కుటుంబం కలిసి కొన్నేళ్లుగా గంజాయి వ్యవహరం కొనసాగిస్తోంది.
Miyapur Firing: కక్షతోనే దేవేందర్ పై రితీష్ కాల్పులు.. గొడవకు కారణమైన ఆమె ఎవరు..?
తాజావార్తలు
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..