Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
- పార్టీ మార్పుపై పోచారం క్లారిటీ
- రేవంత్‌కు సూటి ప్రశ్న
- కేసీఆర్‌పై పోచారం ప్రశంసలు
- బాన్సువాడలో గెలుపుపై ధీమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pocharam Srinivas Reddy: కామారెడ్డి జిల్లా బీర్కూరు చెక్ డ్యాం వద్ద నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి కోసమో లేదా డబ్బుల కోసమో కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు అస్సలు ఇష్టం లేదని, కానీ పరిస్థితుల ప్రభావంతో తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ జెండాను కాదని, కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
నేను నీకు అమ్ముడుపోయానా? సీఎం రేవంత్‌రెడ్డికి సూటి ప్రశ్న
పార్టీ మారిన ఆరు నెలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ కండువా కప్పుకున్నాక సగం నిధులు మాత్రమే మంజూరు చేశారని పోచారం ఆరోపించారు. బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు అభివృద్ధి పనులను నిలిపివేశారని తెలిపారు. గతేడాది నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు.. “నేను నీకు అమ్ముడుపోయానా? లేక నా ఎమ్మెల్యేగిరిని కొన్నావా?” అని సీఎమ్‌ను సూటిగా నిలదీసినట్లు వెల్లడించారు. బాన్సువాడ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కోరినా ఫలితం లేకపోయిందన్నారు. చివరికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా తమ ఫోన్లు ఎత్తడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
Also Read
- Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
- In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
- 22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
- New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి.. అన్నం పెట్టినవారిని మర్చిపోను
బాన్సువాడ నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలోనే నిజమైన అభివృద్ధి జరిగిందని పోచారం కొనియాడారు. “అన్నం పెట్టిన వాళ్లను నేను ఎప్పటికీ మర్చిపోలేను. కొంతమంది దౌర్భాగ్యుల వల్లే నేను పార్టీ మారాల్సి వచ్చింది” అని బాంబేల్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి నిలిచిపోయిన పరిస్థితి ఉన్నప్పటికీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, రాబోయే రోజుల్లో బాన్సువాడలో మళ్లీ మనమే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?