Site icon NTV Telugu

PM Modi: నేడు నాగర్‌కర్నూల్‌కు మోడీ.. బహిరంగ సభ

Pm Modi

Pm Modi

PM Modi:పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ జరగనుంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పాలమూరు-నాగర్ కర్నూల్-నల్గొండ పార్లమెంట్ స్థానాలకు కలిపి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఉదయం జరిగే ఈ ఎన్నికల ప్రచార సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రధాని ఈరోజు ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నాగర్‌కర్నూల్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ అనంతరం హెలికాప్టర్ లో కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్తారు. మళ్లీ 18న జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇప్పటికే రూ.కోటికి పైగా అభివృద్ధి పనులకు మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే.

ఇవాళ్టి ప్రధాని షెడ్యూల్ ఇదే…

* ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్‌లో బయలుదేరి 11.50 గంటలకు నాగర్‌కర్నూల్ చేరుకుంటారు.
* మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు
* 1 గంటకు నాగర్‌కర్నూల్‌ నుంచి హెలికాప్టర్‌లో కర్ణాటకలోని గుల్బర్గాకు మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరుతారు.
* 18న తిరిగి రాష్ట్రానికి. ఆ రోజు షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు.

Read also: Amit Shah: PoK కూడా మాదే.. అక్కడి హిందువులు, ముస్లింలు మావారే.. పాకిస్థాన్ నిరంకుశ దేశం

ట్రాఫిక్ ఆంక్షలు

నగరంలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో నగర ట్రాఫిక్ విభాగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఇవాళ ఉదయం 10.40 నుంచి 11.15 గంటల మధ్య రాజ్‌భవన్‌ నుంచి బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని వెళతారు. ఆ సమయంలో వివి విగ్రహం, మెట్రో రెసిడెన్సీ లేన్, ఎంటిఎస్ రాజ్ భవన్, పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, హెచ్‌పిఎస్ అవుట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పిఎన్‌టి ఫ్లై ఓవర్, ఎయిర్‌పోర్ట్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. మోడీ పర్యటనకు సంబంధించిన భద్రతా చర్యల్లో భాగంగా, రహదారి ప్రాంతం చుట్టూ నిషేధాజ్ఞలు విధిస్తూ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిర్ బెలూన్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్, పారా గ్లైడింగ్ నిషేధించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రోడ్ షో ముగిసే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

కేరళ నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయంలో దిగిన ప్రధానికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని మిర్జాలగూడకు మోదీ నేరుగా చేరుకున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని మోడీ నిర్వహించిన రోడ్‌షోకు వివిధ వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు నిర్వహించిన ఈ రోడ్‌షో పార్టీ నేతలు, క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, ఇతర ప్రజాసంఘాలు రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు, షాపింగ్, వాణిజ్య సముదాయాలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోడీకి స్వాగతం పలికారు.
RCB vs MI: ఎలిమినేటర్‌లో ముంబై ఓటమి.. డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌లోకి బెంగళూరు!

Exit mobile version