Site icon NTV Telugu

PM Modi : తెలంగాణలో బీజేపీ రావడం ఖాయం

Modi Begumpet

Modi Begum

ప్రధాని మోడీ హైదరాబాద్‌లో నేడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా బీజేపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అయితే బేగంపేట ఎయిర్‌ పోర్టులో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో… పట్టుదలకు, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజల పేరుందని, తెలంగాణ ఎప్పుడొచ్చిన మీ రుణం పెరగిపోతోందని అనిపిస్తోందన్నారు.

అంతేకాకుండా.. ఇంత ఎండలోనూ మీరు నాకు ఘన స్వాగతం పలికారని మీ ప్రేమే నా బలం అని.. బీజేపీ ఒక్కొక్క కార్యకర్త సర్దార్‌ పటేల్‌ ఆశయాల కోసం పోరాడుతారని మోడీ అన్నారు. భారతదేశానికి సేవ చేసేందుకు మనమంతా పనిచేస్తామన్నారు. పటేల్ ఆశయాలను బీజేపీ కార్యకర్తలు ముందు తీసుకెళ్లాలని, బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చిందన్నారు. అంతేకాకుండా తెలంగాణను టెక్నాలజీ హబ్‌గా మార్చామన్నారు. అంతేకాకుండా తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలి అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ రావడం ఖాయమని మోడీ ఉద్ఘాటించారు.

Exit mobile version