Site icon NTV Telugu

బీజేపీకి ఈటల అనుచరుడి రాజీనామా.. పార్టీలో ఇమడలేకపోతున్నా..

హుషారుగా మాజీ మంత్రి ఈటలతో పాటు విమానం ఎక్కి.. ఢిల్లీలో బీజేపీ చేరిన నేతలు.. ఇప్పుడు మళ్లీ కమలం పార్టీకి బైబై చెబుతున్నారు.. తాజాగా, ఈటల ప్రధాన అనుచరుడిగా పేరున్న టి.స్కాబ్‌ వైస్ చైర్మన్‌ పింగళి రమేష్‌.. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరినా.. మేం ఆ పార్టీలో ఇమడలేకపోతున్నాం అన్నారు.. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు పింగళి రమేష్‌.. వామపక్ష భావాలున్న మాకు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చలేదన్న ఆయన.. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో టీఆర్ఎస్‌ కొనసాగడానికి నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని కృతనిచ్చాయంతో తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్ దన్న ఆయన.. సామాన్య కార్యకర్తగానే అందరిని కలుపుకుని టీఆర్ఎస్‌ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామని ప్రకటించారు. ఇక, కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధు అద్భుతమైన పథకం అని ప్రశ్నించిన రమేష్‌.. నియోజకవర్గంలో సామాన్యులకు స్థానం కల్పించిన ఘనత కూడా కేసీఆర్‌దే అన్నారు.. త్వరలో హంగులు ఆర్భాటాలు లేకుండా టీఆర్ఎస్‌లో చేరతానని.. త్వరలో తేదీని కూడా ప్రకటిస్తానని వెల్లడించారు టి స్కాబ్ వైస్ చైర్మన్ పింగళి రమేష్.

Exit mobile version