MLA Rohit Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. నేడు విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గతం లోనే ఈడీ నోటీస్ లు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈడీ విచారణను నిలిపివేయాలంటూ.. హైకోర్టులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. రోహిత్ రెడ్డి పిటిషన్ బుధవారం (రేపు 28న) హైకోర్ట్ లో విచారణకు రానుంది. ఇప్పటికే రెండు రోజులు రోహిత్ రెడ్డి ని విచారించిన ఈడీ, నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో…నేడు మరో మారు రోహిత్ రెడ్డి నీ విచారించనున్నట్లు ఈడీ వెల్లడించింది. హైకోర్టు లో పిటిషన్ విచారణ జరిగే వరకు అయితే.. రోహిత్ రెడ్డి తాను విచారణకు హాజరు కానంటున్నారు. హైకోర్ట్ నుండి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో.. ఈడీ అధికారులు రోహిత్ రెడ్డి విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో రోహిత్‌రెడ్డిని మళ్లీ ఈడీ ప్రశ్నించనుంది. పైలట్ రోహిత్ రెడ్డి హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంది.
Read also: Andhra Pradesh: వైసీపీలో చేరి తప్పు చేశా.. పరిటాల సునీత కాళ్లపై పడ్డ కార్యకర్త
తాజాగా రోహిత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. మా ఎమ్మెల్యే లను కొనుగోలు చేయాలన్న ప్రయత్నం మీ అందరికీ తెల్సిందే. సిట్ ద్వారా అందరికీ వీడియోలు వెళ్ళాయి…మా కుటుంబ సభ్యుల ను వేధిస్తున్నారు. టీఆర్ఎస్ ను బీఅర్ఎస్ గా మార్చడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఫిర్యాదుదారుడుని నాకీ ఈడీ నోటీసులు పంపించింది. నాకు ఏ కేసో కూడా తెలియడం లేదు. ఇక రెండో రోజు నేను కేసు వివరాలు చెప్పకపోతే నేను రాను అంటే అప్పుడు చెప్పారు. ఎమ్మెల్యే ల కొనుగోలు కేసు అని.. నేను దొంగను కాదు కాబట్టి నేను దేనికైన సిద్దం. BL సంతోష్, తుషార్ ఎందుకు విచారణకు రావడం లేదు. దేనికీ భయపడం. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి. స్టే ఎందుకు తెచ్చుకుంటున్నారు. నన్ను ఎందుకు విచారణ చేశారు అని నేను కోర్టు కు వెళ్తున్నా. BL సంతోష్ నేరం బయట పడుతుంది అనే స్టే లు తెచ్చుకుంటున్నారు. 27 న ఈడీ విచారణకు హాజరవుతా ఆలోపు కోర్టుకు వెళ్తనన్న విషయం తెలిసిందే. మరి ఈడీ ముందు రోహిత్ రెడ్డి హాజరవుతారా? లేదా? అనే విషయం పై ఉత్కంఠంగా మారింది.
Twitter Data Leak: చరిత్రలో అతిపెద్ద డేటా లీక్.. అమ్మకానికి 40 కోట్ల మంది వివరాలు