తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక విచారణ బృందం (SIT) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్‌రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. హరీష్‌రావుపై వచ్చిన ఆరోపణలు, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన అధికారుల వాంగ్మూలాల ఆధారంగా సిట్ అధికారులు విచారణ చేపట్టారు. సుమారు ఏడు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన పాత్ర, ఇంటెలిజెన్స్ అధికారులతో ఉన్న సంబంధాలు, పార్టీ పరంగా జరిగిన పరిణామాలపై అధికారులు ఆయనను కూలంకషంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
హరీష్‌రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. విచారణ జరుగుతున్నంత సేపు స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. విచారణ ముగిసిన అనంతరం జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి బయటకు వచ్చిన హరీష్ రావు మాట్లాడుతూ.. ఇదంతా ట్రాష్ అని, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని విమర్శించారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ తరుఫున న్యాయవాదిని కూడా అనుమతించలేదని ఆయన వెల్లడించారు. అయితే.. సిట్ విచారణ ముగిసిన హరీష్‌రావు తెలంగాణ భవన్‌కు బయలుదేరారు. విచారణలో తనను అడిగిన ప్రశ్నలు, దర్యాప్తు తీరు, ఈ కేసు వెనుక ఉన్న రాజకీయ పరిణామాలపై ఆయన కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
Asim Munir: పాకిస్తాన్ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో, అది ఇప్పుడు నెరవేరుతోంది..
