Site icon NTV Telugu

Phone Tapping : సిట్‌ ముందుకు ఈటల రాజేందర్

Etela

Etela

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సిట్ అధికారులు తాజాగా కీలక వ్యక్తులను విచారిస్తున్నారు. సోమవారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయనను సాక్షిగా విచారించనుండగా, మరికాసేట్లో ఆయన సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఇక ఇదే కేసులో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత బిల్ల సుధీర్ రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సోమవారం సిట్‌కు తమ వాంగ్మూలాలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు… “ట్యాపింగ్‌ లిస్టులో ఉన్న నంబర్‌ మీరు వాడుతున్నదేనా? ఎప్పుడైనా ఫోన్ ట్యాపింగ్ అనుమానం కలిగిందా?” అని సిట్ అధికారులు తమను ప్రశ్నించినట్లు వెల్లడించారు.

Sunil Gavaskar – Rishabh Pant: స్టుపిడ్ టూ సూపర్బ్.. సునీల్ గవాస్కర్, పంత్ మధ్య మాములుగా లేదుగా..!

ఈ సందర్భంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన హర్షవర్ధన్ రెడ్డి, “ఎవరితో మాట్లాడుతున్నామో గుర్తించి, మఫ్టీలో పోలీసులు వెంటాడుతున్నారని అనిపించేది” అని చెప్పారు. ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దురుద్దేశాలను సూచిస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు.

Gadwal Murder : ఐదుసార్లు తప్పించుకున్న తేజేశ్వర్… ఆరోసారి బలయ్యాడు.. సంచలన విషయాలు వెలుగులోకి

Exit mobile version