Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సిట్ అధికారులు తాజాగా కీలక వ్యక్తులను విచారిస్తున్నారు. సోమవారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయనను సాక్షిగా విచారించనుండగా, మరికాసేట్లో ఆయన సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఇక ఇదే కేసులో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత బిల్ల సుధీర్ రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సోమవారం సిట్‌కు తమ వాంగ్మూలాలు ఇచ్చారు.…