Site icon NTV Telugu

Phone Tapping Case : హరీష్‌రావు విచారణపై సిట్‌ కీలక ప్రకటన

Phone Tapping

Phone Tapping

రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో (పంజాగుట్ట PS క్రైం నెం. 243/2024) మాజీ మంత్రి హరీష్‌రావు విచారణ పూర్తయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ విచారణపై సిట్ అధికారులు తాజాగా స్పష్టతనిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. హరీష్‌రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం ఆయనను వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అయితే, ఆయన కుమారుడి ఫ్లైట్ ప్రయాణం ఉన్న కారణంగా విచారణను కొంత ముందస్తుగా ముగించవలసి వచ్చిందని సిట్ అధికారులు వివరించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు.

Ratha Saptami 2026: ఈ ఏడాది రథ సప్తమి తేదీ – పూజా విధానం, సంప్రదాయాలు ఇలా..!

విచారణ ముగిసిన తర్వాత హరీష్‌రావుకు సిట్ అధికారులు కొన్ని కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించకూడదని హరీష్‌రావును ఆదేశించారు. విచారణ ప్రక్రియలో లేదా దర్యాప్తులో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దర్యాప్తు అవసరాల దృష్ట్యా అవసరమైతే ఆయనను మళ్లీ విచారణకు పిలుస్తామని అధికారులు స్పష్టం చేశారు.

హరీష్‌రావు విచారణ విషయంలో పోలీసులు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ వస్తున్న వార్తలపై సిట్ ఘాటుగా స్పందించింది. తాము ఎక్కడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని, చట్టప్రకారమే విచారణ సాగిందని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ కేసు విషయంలో సోషల్ మీడియాలో లేదా ఇతర మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

Karreguttalu : మావోయిస్టుల కంచుకోటలో కేంద్ర బలగాల పాగా.. కర్రెగుట్టలపై వెలిసిన నూతన పోలీస్ బేస్ క్యాంప్

Exit mobile version