NTV Telugu Site icon

Karimnagar: హుస్సేన్ పురలో పీఎఫ్ఐ కదలికలు.. ఎన్ఐఏ సోదాలు

Asi

Asi

Karimnagar: ఆగస్టు 15 సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అనుమానితుల ఇళ్లపై సోదాలు చేపట్టారు. ఈనేపథ్యంలో.. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్ ఐఎ సోదాలు చేపట్టారు. నగరంలోని తబ్రేజ్ అనే వ్యక్తికి నిషేదిత సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాల నేపధ్యంలో NIA సోదాలు చేస్తున్నారు. తెల్లవారు జామున 3-30 గంటలకి NIA అధికార బృందం తబ్రేజ్ ఇంటికి వచ్చారు. దాదాపు ఐదు గంటలు 8-30 వరకి తబ్రేజ్ ఇంట్లో అధికారుల సోదాలు చేశారు. అయితే దుబాయ్ లో తబ్రేజ్ ఉన్నట్లు గుర్తించారు. దాదాపు ఐదు గంటలు NIA అధికారుల సోదాలు చేపట్టారు. తబ్రేక్‌ ఇంట్లో కీలక అధికారులు సేకరించినట్లు‌ సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పీఎఫ్‌ఐ కదలికలపై అనుమానంతో గతంలో ఎన్‌ఐఏ అధికారులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.

Read also: AP BJP: పంచాయితీ నిధుల కోసం కలెక్టరేట్ల ముట్టడికి బీజేపీ పిలుపు

సెప్టెంబర్ 18, 2022 న, NIA అధికారులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని 40 ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో నలుగురిని అరెస్టు చేశారు. తెలంగాణలోని నిజామాబాద్‌లో పీఎఫ్‌ఐ కదలికలను తొలుత స్థానిక పోలీసులు గుర్తించారు. నిజామాబాద్‌లో వ్యాయామ శిక్షణ నిర్వహిస్తున్న ఓ ట్రైనర్ ఇంటిపై పోలీసులు దాడి చేయడంతో పీఎఫ్‌ఐ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా, స్థానిక పోలీసులు జూలై 4, 2022న నలుగురిని అరెస్టు చేశారు. షేక్ సహదుల్లా, మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ అబ్దుల్ మొబీన్ మరియు అబ్దుల్ ఖదీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఎన్ఐఏ అధికారులు పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. పలు చోట్ల పలువురిని అరెస్టు చేశారు. కాగా, తెలంగాణలో పీఎఫ్ఐ కేసును స్థానిక పోలీసులు ఎన్ఐఏకు అప్పగించారు. ఈ కేసును ఎన్‌ఐఏ విచారించనుంది. నిజామాబాద్‌లో యువతను పీఎఫ్‌ఐ వైపు ఆకర్షించేందుకు మహ్మద్‌ ప్రయత్నించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆత్మరక్షణ పేరుతో యువత శిక్షణ ఇస్తూ ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Cruel Husband: భార్యను కాపురానికి పంపించలేదని.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు