NTV Telugu Site icon

Hyderabad Petrol Bunks: పెట్రోల్‌ పై మళ్లీ పుకార్లు.. బంకుల్లో జనం క్యూ..

Hyderabad Petroll

Hyderabad Petroll

Hyderabad Petrol Bunks: పెట్రోల్ బంకులు మూతపడతాయన్న వదంతులు మళ్లీ వ్యాపించడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కోసం ప్రజలు బారులు తీరారు. నగరంలోని పాతబస్తీలో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నోస్టాక్ బోర్డులు కూడా దర్శనమిచ్చాయి. దీంతో వాహనాలుకు సమాచారం తెలియడంతో బంక్ ల వద్దకు హుటి హుటిన పరుగులు పెట్టారు. ఇటీవల హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలను వ్యతిరేకిస్తూ ఆయిల్ ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా పెట్రోలు బంకులకు జనం పోటెత్తారు. అయితే పెట్రోల్ లో బంక్ లు బంద్ కాలేదని, వాహనదారులు భయపడాల్సిన పనిలేదని బంక్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చారు. ఇవి ఒట్టి పుకార్లే నని స్పష్టం చేశారు.

Read also: Chandrababu and Pawan Kalyan: కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌..

ఇక ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె కారణంగా రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. జనవరి 1 నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మంగళవారం హైదరాబాద్ నగరంలోని చాలావరకు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. బంక్ ల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే, హైదరాబాద్‌లోని కొన్ని ఓపెన్ పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులను మూసివేయడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ఓపెన్ పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్లతో బారులు తీరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.

Read also: Chandrababu and Pawan Kalyan: కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌..

కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ మోటార్ వెహికల్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ట్యాంకర్ డ్రైవర్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. వాహనాల యజమానులు, డ్రైవర్లు రోడ్లపై ప్రమాదానికి గురై పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతే.. వారికి పది లక్షల జరిమానా, ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. అయితే ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదాల విషయంలోనూ ఇది వర్తింపజేయడంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆగ్రహించిన ట్యాంకర్ల యజమానులు కేంద్రం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పెట్రోల్ బంక్ లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు బంక్ లకు క్యూ కట్టారు. దీంతో పెట్రోట్ బంక్ లో భారీగా వాహనాలు దర్శనమిచ్చాయి.
UNESCO: మొదటి సారి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి భారత్ నాయకత్వం..