Petrol Bunk: పెట్రోల్ బంక్‌లో అద్భుతం.. డీజిల్ స్థానంలో నీళ్లు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol Bunk Serving Water In The Place Of Diesel: ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టు.. పెట్రోల్ బంక్‌ల యజమానులు అక్రమాలకు పాల్పడుతూ, వాహనదారుల జేబులకు మరింత చిల్లులు పెడుతున్నారు. పెట్రోల్, డీజిల్‌లను కల్తీ చేస్తూ.. నిండా దోచేసుకుంటున్నారు. మీటర్‌కి భిన్నంగా తక్కువ పెట్రోల్ కొడుతూ, మోసాలకు పాల్పడుతున్నారు. మరింత సొమ్ము కాజేయాలన్న కక్కుర్తితోనే కొందరు ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజాగా అంతకుమించిన షాకింగ్ ఘటన వెలుగుచూసింది. డీజిల్‌కి బదులు.. ఏకంగా నీళ్లు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..
Revanth Reddy: కళికోట సూరమ్మ ప్రాజెక్టును సందర్శించిన రేవంత్.. నిలిచిపోయిన పనులపై ఆరా
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌కి ఒక వ్యక్తి పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్లాడు. ఎదురుగా డీజిల్ కొట్టిస్తున్న సమయంలో.. ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. సాధారణంగా పెట్రోల్ లేదా డీజిల్ కొట్టిస్తున్నప్పుడు.. ఆవిరి వస్తుంటుంది. కానీ.. ఇక్కడ డీజిల్ కొడుతుంటే, అలాంటి ఆవిరి రాకపోవడాన్ని ఆ వ్యక్తి గమనించాడు. దీంతో అతడు ఓ తెలివైన పని చేశాడు. ఓ బాటిల్ తీసుకొచ్చి, అందులో డీజిల్ కొట్టాలని చెప్పాడు. తొలుత ఆ బంక్ వాళ్లు ఒప్పుకోలేదు. ఇది చట్టవిరుద్ధమంటూ రూల్స్ మాట్లాడారు. కానీ.. ఆ వ్యక్తి మాత్రం వెనక్కు తగ్గకుండా బాటిల్‌లో డీజిల్ కొట్టమంటూ కొంచెం గట్టిగా మాట్లాడటంతో, ఆ పెట్రోల్ సిబ్బంది మరో దారి లేక బాటిల్‌లో కొట్టాడు. దాంతో అసలు బాగోతం బయటపడింది. డీజిల్‌కి బదులు అందులో నుంచి నీళ్లు వచ్చాయి.
Bandi Sanjay: మీ పాలనలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.. సీఎంకు బండి సంజయ్ బహిరంగ లేఖ
ఇంకా విడ్డూరమైన విషయం ఏమిటంటే.. ‘ఇది డీజిలా?’ అని అడిగితే, సిబ్బంది అవునని సమాధానం ఇవ్వడం! రంగు మారిందే తప్ప, క్వాలిటీ కాదంటూ మాయమాటలు చెప్పేందుకు ప్రయత్నించాడు. ఆల్రెడీ 70 బండ్లకు ఇదే డీజిల్ కొట్టానంటూ కుండబద్దలు కొట్టాడు. కానీ, జనాలు మరీ అంత తెలివితక్కువ వాళ్లు కాదు కదా! ఏది డీజిలో, ఏది నీళ్లో కనుక్కోకుండా ఉండటానికి! ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు రంగంలోకి దిగి, ఈ వ్యవహారంపై విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు