Site icon NTV Telugu

Revanth Reddy: కేసీఆర్‌ అవినీతికి కంచె వేసి కాపాడుతోంది అమిత్‌షానే..!

Revanth Reddy

Revanth Reddy

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… అమిత్‌షా హోంమంత్రి లెక్క మాట్లాడలేదు.. చౌకబారు నేత లెక్క మాట్లాడారంటూ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌ దోపిడీ చేస్తే… హోం మంత్రిగా అమిత్ షా బాధ్యత మరచి మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు కేసీఆర్‌ అవినీతికి కంచే వేసి కాపాడుతుంది అమిత్ షానే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించిన ఆయన.. చర్యలు తీసుకునే అధికారం బీజేపీ చేతిలో ఉంది.. ఏం చేయకుండా మాటలు మాట్లాడుతుందన్నారు అని మండిపడ్డారు.

Read Also: Revanth Reddy: మే 21 నుంచి రైతు రచ్చ బండ..

మరోవైపు… బీజేపీకి టీఆర్ఎస్‌ ప్రొటెస్ట్‌ మని ఇస్తుందని ఆరోపించారు రేవంత్‌రెడ్డి.. గుజరాత్ ఎన్నికలకు కూడా టీఆర్ఎస్‌ డబ్బులేనని ఆరోపించిన ఆయన.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా… తెలంగాణ నుండే డబ్బులు వెళ్తున్నాయని వ్యాఖ్యానించారు. అందుకే కేసీఆర్‌ని అమిత్‌షా కాపాడుతున్నారని పేర్కొన్నారు.. ఇక, బీజేపీ సొంత పార్టీ నేతలపై కూడా సీబీఐ విచారణలు జరిపింది.. కానీ, కేసీఆర్‌ మీద అసలు ఏ కేసు పెట్టడం లేదని నిలదీశారు. సత్యాహరిచంద్రుడు.. కేసీఆర్‌ కవలపిల్లలా..? అని ఎద్దేవా చేసిన రేవంత్‌రెడ్డి.. ఈఎస్‌ఐ కుంభకోణం కేసు ఎనిమిదేళ్లుగా తొక్కి పెట్టింది బీజేపీయేనని మండిపడ్డారు. కేసీఆర్‌ మీద ఉన్న సీబీఐ కేసుల ఎందుకు తొక్కి పెట్టారని ప్రశ్నించారు. రెండు కేసులు… ఇప్పుడు దోచుకున్న సొమ్ముపై ఎందుకు విచారణ జరపలేదు అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. కేసీఆర్‌ని బీజేపీ బొక్కలో వేయలేదు.. ఎందుకంటే కేసీఆర్‌ వేసే బొక్కల కోసం బీజేపీ చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version