MLA Mahipal Reddy: తప్పు చేస్తే ఫెనాల్టీ వేయండి.. కన్నీరు పెట్టుకున్న మహిపాల్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Mahipal Reddy: నిబంధనలకు విరుద్ధంగా సంతోష్ ఇసుక, గ్రానైట్‌లను నడుపుతున్న పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో.. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. తప్పు చేస్తే ఫెనాల్టీ వేయాలని తెలిపారు. 2011-12 లో క్వారీ లీజుకు తీసుకున్నామని, గత నాలుగేళ్లుగా మేము సొంతంగా సంతోష్ క్రషర్లు కంపెనీ పేరుతో నిర్వహిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. తప్పు చేసినట్టు రుజువు అయితే ఫెనాల్టీ వేయాలని కోరారు.
కానీ తెల్లవారుజామున 3 గంటలకు వందల మంది పోలీసులు వచ్చి అక్రమ అరెస్టులు చేశారని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలపై కేసులు పెడుతున్నారని వాపోయారు. పటాన్ చెరులో 40 క్రషర్లు ఉన్నాయి..అందులో చాలా వాటికి లైసెన్స్ అయిపోయిన నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఇబ్బంది పెట్టి, పార్టీలోకి లాగలని చూస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మా దగ్గర ఆధారాలతో క్వారీకి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఉన్నాయని మహిపాల్ రెడ్డి తెలిపారు.
Also Read
Read also: PM Modi: వచ్చే వారం భూటాన్ పర్యటనకు ప్రధాని నరేంద్రమోడీ..
కాగా.. మరోవైపు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతనిపై అక్రమ మైనింగ్, చీటింగ్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్స్ నడిపారనే కారణంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో మధుసూదన్‌ను వైద్య పరీక్షల నిమిత్తం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉందని తెలుస్తుంది. మధుసూదన్ రెడ్డికి సంతోష్ గ్రానైట్ మైనింగ్ అనే క్రషర్ కంపెనీ ఉంది.
నాలుగు ఎకరాల ప్రభుత్వ లీజుకు తీసుకుని మరో నాలుగు ఎకరాలను అక్రమంగా క్రషింగ్ చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. పరిమితికి మించి గుంతలు తవ్వుతున్నట్లు మైనింగ్ శాఖ నివేదిక ఇచ్చింది. కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు క్రషర్లను సీజ్ చేశారు. మధుసూదన్‌రెడ్డి అరెస్ట్ అనంతరం బీఆర్‌ఎస్ కార్యకర్తలు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులు మోహరించారు.
Dr.K. Laxman: వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇప్పుడు 24 వారాలు
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాష’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!