మినీ భారత్ లా భావించే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు శరవేగంగా అభివృద్ధిచెందుతోంది. ఒకప్పుడు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ నియోజకవర్గం ఇప్పుడు కాలుష్యానికి దూరంగా నివాసయోగ్యంగా మారుతోంది. ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్డు, మరోవైపు ప్రతిష్టాత్మకంగా ఐఐటీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఉన్నత విద్యాసంస్థలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలతో విద్యార్ధులకు అత్యుత్తమ విద్య అందుతోంది. తాజాగా పటన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన ఔదార్యం చాటారు.
Read Also: RCB Twitter Hacked: ఆర్సీబీ ట్విట్టర్ హ్యాక్..పేరే మార్చేశారు!
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 35 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న 1947 మంది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించేందుకు 15 లక్షల రూపాయలు సొంత నిధులు అందజేశారు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు.
పదవతరగతి విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక తరగతులకు హాజరుకావాలనే ఉద్దేశంతో ఈ నిధులు అందిస్తున్నట్టు తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్ధినీ, విద్యార్ధులకంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు అత్యుత్తమ ప్రమాణాలు సాధిస్తున్నారన్నారు. విద్యార్ధులకు రెండుపూటలా అల్పాహారం అందించడం అభినందనీయం అంటున్నారు విద్యార్ధుల తల్లిదండ్రులు.
Read Also: RRR Movie: అంతర్జాతీయ వేదికలపై అలరించిన ‘ట్రిపుల్ ఆర్’