NTV Telugu Site icon

Palvai Sravanti Serious Warning: పాల్వాయి స్రవంతి సీరియస్‌ వార్నింగ్‌.. ఫేక్‌ న్యూస్‌ పై ఈసీకి ఫిర్యాదు చేస్తా!

Kcr Palvai Sravanthi

Kcr Palvai Sravanthi

Palvai Sravanti Serious Warning: ఓ ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ గా మారింది. మునుగోడు పోలింగ్‌ వేళ సీఎం కేసీఆర్ ను మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కలిసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. సీఎం కేసీఆర్‌ ను స్రవంతి కలిసినట్లు సోషల్‌మీడియాలో వార్తలు రావడంతో.. ఈవార్త కాస్త హల్ చల్‌ గా మారింది. ఇక రెండు పార్టీలు ఒక్కటయ్యాయని వార్త తెగ హల్ చల్‌ చేస్తుంది. ఎన్టీవీ పేరుతో కొందరు ఫేక్ ప్రచారం చేశారు. టీఆర్ఎస్‌ అభ్యర్థికి మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి మద్దతు ఇచ్చినట్లు కొంత మంది పోస్టులు పెట్టారు. నిన్నటి నుంచి అన్ని పార్టీల మీద ప్రచారంలోకి వచ్చిన ఫేక్‌ వీడియోలు ప్రసారం చేస్తుండగా.. ఇక తాజాగా పాల్వాయి స్రవంతిపై ఫేక్‌ ప్రచారం దుమారం రేపుతున్నాయి. మునుగోడులో సీఎం కేసీఆర్‌ను కలిశారంటూ నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌ చల్ చేశాయి. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పందించారు. ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారానని ప్రచారం చేస్తున్న వారి పైన ఈసీకి పిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బీజేపీ నేతల కుట్రనే ఇది అని ఆరోపించారు.

Read also: Jammu Kashmir: కాశ్మీర్‌లో పెరిగిన విదేశీ ఉగ్రవాదులు.. కేంద్రం వెల్లడి.

కాంగ్రెస్ శ్రేణులు మునుగోడు ప్రజలు పూర్తిగా గమనించాలని పాల్వాయి శ్రవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్ముడు పోయే వారే ఈ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాను.. కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు శ్రవంతి. అధికారంలో ఉన్న రెండు పార్టీలో సామాన్యుల పైనా కూడా దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒక్క ఆడపిల్లను ఎదుర్కొనే లేక ఈ ప్రచారం చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాళ్ళను గుర్తించాలి అంటున్నారు పాల్వాయి స్రవంతి. ఇవాళ మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాల్లో 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవాళ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 వరకు లైనులో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.