Site icon NTV Telugu

Palvai Sravanthi: మణిపూర్ అల్లకల్లోలంపై ప్రధాని మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు

Palvai Sravanthi On Modi

Palvai Sravanthi On Modi

Palvai Sravanthi Fires On PM Narendra Modi Over Manipur Violence: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. 80 రోజులుగా మణిపూర్ అట్టుడుకుతుంటే.. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్ వద్ద పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. మణిపూర్‌లో ఏం జరగనట్టు ప్రధాని మోడీ మాట్లాడుతున్నారని, మణిపూర్ అల్లకల్లోలంపై ఇంతవరకూ మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆదివాసీ తెగల మీద బీజేపీ చిచ్చుపెట్టిందని విమర్శించారు.

Ponguleti Srinivas Reddy: చిత్తశుద్దితో హస్తం గుర్తుపై ఓట్లు పడేలా కృషి చేస్తాం

మణిపూర్ ముఖ్యమంత్రి ఇలాంటి ఘటన జరగడం ఇదొక్కటే కాదని, వందల సంఖ్యలో జరుగుతుంటాయని చెప్పడం.. బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని పాల్వాయి స్రవంతి ధ్వజమెత్తారు. ఈ సంఘటన మే 3వ తేదీన జరిగితే, రెండు నెలల తర్వాత వీడియో బయటకొచ్చాక తాను భావోద్వేగానికి గురవుతున్నానని చెప్పడం సిగ్గుచేటు అని నిప్పులు చెరిగారు. బీజేపీ మహిళా మంత్రి స్మృతి ఇరానీకి గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడంలో ఆసక్తి మణిపూర్ ఘటనపై లేదని కౌంటర్ వేశారు. బీజేపీలో ఉన్న మహిళా నాయకత్వం ఆత్మ విమర్శన చేసుకోవాలన్నారు. బీజేపీ మహిళా నాయకత్వం ఇప్పటికైనా మణిపూర్ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు.

Srinivas Goud: కల్తీ మద్యంపై తొలి పీడీ యాక్ట్.. కఠిన చర్యలు తప్పవంటూ మంత్రి వార్నింగ్

అలాగే.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఈషాన్య రాష్ట్రాల మరణాహోమం కనిపించడం లేదా? అని పాల్వాయి స్రవంతి ప్రశ్నించారు. రాజస్థాన్‌లో దళిత మహిళపై అత్యాచారం జరిగితే 24 గంటల్లోనే పట్టుకున్నారని, కానీ మణిపూర్ ఘటనపై 80 రోజులుగా ఏ ఒక్కరూ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఏంటని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కంటే మణిపూర్ అల్లకల్లోలం తక్కువేనని అనడం, బీజేపీ ఏంటో అర్థమవుతుందన్నారు. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సైనికుడి కుటుంబానికే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version