Palvai Sravanthi: మణిపూర్ అల్లకల్లోలంపై ప్రధాని మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palvai Sravanthi Fires On PM Narendra Modi Over Manipur Violence: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. 80 రోజులుగా మణిపూర్ అట్టుడుకుతుంటే.. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్ వద్ద పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. మణిపూర్‌లో ఏం జరగనట్టు ప్రధాని మోడీ మాట్లాడుతున్నారని, మణిపూర్ అల్లకల్లోలంపై ఇంతవరకూ మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆదివాసీ తెగల మీద బీజేపీ చిచ్చుపెట్టిందని విమర్శించారు.
Ponguleti Srinivas Reddy: చిత్తశుద్దితో హస్తం గుర్తుపై ఓట్లు పడేలా కృషి చేస్తాం
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
మణిపూర్ ముఖ్యమంత్రి ఇలాంటి ఘటన జరగడం ఇదొక్కటే కాదని, వందల సంఖ్యలో జరుగుతుంటాయని చెప్పడం.. బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని పాల్వాయి స్రవంతి ధ్వజమెత్తారు. ఈ సంఘటన మే 3వ తేదీన జరిగితే, రెండు నెలల తర్వాత వీడియో బయటకొచ్చాక తాను భావోద్వేగానికి గురవుతున్నానని చెప్పడం సిగ్గుచేటు అని నిప్పులు చెరిగారు. బీజేపీ మహిళా మంత్రి స్మృతి ఇరానీకి గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడంలో ఆసక్తి మణిపూర్ ఘటనపై లేదని కౌంటర్ వేశారు. బీజేపీలో ఉన్న మహిళా నాయకత్వం ఆత్మ విమర్శన చేసుకోవాలన్నారు. బీజేపీ మహిళా నాయకత్వం ఇప్పటికైనా మణిపూర్ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు.
Srinivas Goud: కల్తీ మద్యంపై తొలి పీడీ యాక్ట్.. కఠిన చర్యలు తప్పవంటూ మంత్రి వార్నింగ్
అలాగే.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఈషాన్య రాష్ట్రాల మరణాహోమం కనిపించడం లేదా? అని పాల్వాయి స్రవంతి ప్రశ్నించారు. రాజస్థాన్‌లో దళిత మహిళపై అత్యాచారం జరిగితే 24 గంటల్లోనే పట్టుకున్నారని, కానీ మణిపూర్ ఘటనపై 80 రోజులుగా ఏ ఒక్కరూ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఏంటని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కంటే మణిపూర్ అల్లకల్లోలం తక్కువేనని అనడం, బీజేపీ ఏంటో అర్థమవుతుందన్నారు. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సైనికుడి కుటుంబానికే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!