టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న గవర్నర్ తమిళిసైకి తెలంగాణలో సీట్లు బ్లాక్ చేస్తున్నారని బహిరంగ లేఖ రాశారు. లేఖలో మంత్రులు, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీనిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణలో సీట్లు బ్లాక్ చేసే వాళ్లకు యూనివర్సిటీ లేఖ రాస్తుందని, బ్లాక్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నామన్నారు. ఇలాంటి దందాలు చేసే వాళ్లపై కేసులు కూడా పెడుతున్నామని ఆయన తెలిపారు. ఒక్క సీటు కూడా ఇంతవరకు మేనేజ్మెంట్ లకు ఇవ్వలేదని, నీకు సిగ్గు దమ్ము, నిజాయితీ ఉంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీలతో దర్యాప్తు చేయించుకో అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒరేయ్ వెధవ అసలు నాకు మెడికల్ కాలేజీ లేనే లేదు అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. అనురాగ్ కాలేజీల విషయంలో డాక్యుమెంట్లపై ఏ ప్రొఫెసర్ తో అయిన విచారణ చేయించుకో.. తప్పు అని తేలితే రాజయకీయల నుండి తప్పుకుంటానని ఆయన రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కొడంగల్ నియోజకవర్గంలో ఒడిపోతే రాజకీయల నుండి తప్పుకుంటా అన్నావ్.. నువ్ మాటమీద నిలబడే వ్యక్తివి కాదు.. అంటూ ఆయన ధ్వజమెత్తారు.