Site icon NTV Telugu

Palla Rajeshwar Reddy: బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డ రాజేశ్వర్‌రెడ్డి..

Palla Rajeshwar Reddy

Palla Rajeshwar Reddy

వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇక, టీఆర్ఎస్‌ నేతలు, తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఈ తరుణంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ కుక్కలు.. రైతులను వరి వేయాలని చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా బూట్లు నాకి.. బండి సంజయ్‌.. తెలంగాణలో రైతులు వరి ధాన్యం పండించాలన్నారని మండిపడ్డారు.. బండి సంజయ్‌కి వరికి.. గోధుమలకు తేడా తెలవదని ఎద్దేవా చేసిన ఆయన.. తెలివి తక్కువ వెదవ, ఆత్మ గౌరవం లేని సన్యాసి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read Also: TTD: శ్రీవారి సర్వదర్శనం టికెట్ల కోసం తొక్కిసలాట..! టీటీడీ కీలక నిర్ణయం..

మోడీ… బోడి పాలనలో గుజరాత్‌లో ఆరు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. బండి సంజయ్… సిగ్గు శరం ఉందా ? అంటూ ఫైర్‌ అయిన ఆయన.. నీకు తెలుసారా ? తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయా ? అని ప్రశ్నించారు.. నేను రైతు బిడ్డను… నన్ను తిడతావా..? అని నిలదీసిన ఆయన.. మిర్చికి కనీస మద్దతు ధర ఉండదని బండి సంజయ్‌కి తెలియదు… అసలు మిర్చికి ఎంఎస్పీ ఉండదు.. బ్రోకర్ గిరి చేసేది నీవురా? అంటూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఉరికించుడు నీకు రాదు… మేం ఉరికిస్తాం అని హెచ్చరించారు. నా మీద ఐటీ, ఈడీ, సీబీఐ దాడి చేయిస్తావా? దేనికైనా నేను సిద్ధం బండి సంజయ్.. చెత్తనా కొడకా.. పిచ్చి మాటలు మాట్లాడితే… పిచ్చికుక్కలకు పట్టిన గతే నీకు పడుతుందంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.

Exit mobile version