Palamuru to Goa: ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి గోవా బీచ్‌లలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ క్యాంపుల్లో నివాసం ఉంటున్నారు. వీరంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు కావడంతో రాజకీయ పార్టీలు వారిని అక్కడికి తరలించినట్లు సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఈ నెల 28న జరగనున్న నేపథ్యంలో ఓటర్లు ఎవరూ బయట పడకుండా ఉండేందుకు రాజకీయ పార్టీలు గోవా క్యాంపులకు తరలివెళ్లాయి. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు.
మహబూబ్ నగర్ నుంచి బీఆర్ ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ స్థానానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
Read also: Thalaivar 171 : ‘తలైవా 171’ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్..
కొంత ఆర్థిక బలం, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను మేనేజ్ చేయగలిగిన అభ్యర్థులను ఇరు పార్టీలు ఎంపిక చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డిని ఖరారు చేయగా, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి బరిలోకి దిగారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు 825 ఓట్లు ఉండగా, కాంగ్రెస్‌కు 327 ఓట్లు ఉన్నాయి. మిగిలిన ఓట్లు బీజేపీ, స్వతంత్ర, సీపీఐ, సీపీఎం పార్టీలకు పడ్డాయి. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాలని సూచించింది. దీంతో ఎమ్మెల్యేలు చేరికలను చురుగ్గా ప్రోత్సహిస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరీక్షలు పోటీ పడుతున్నాయనే చర్చ నడుస్తుండగా.. చాలా నియోజకవర్గాల్లో పార్టీలు క్యాంపు రాజకీయాలు ప్రారంభించాయి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఓటర్లను గోవాకు తీసుకెళ్లగా.. వారంతా బీచ్‌లు, క్యాసినోలు, పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. భార్యలు ప్రజాప్రతినిధులుగా ఉన్న చోట భర్తలు కుటుంబ సమేతంగా వెళతారు, భర్తలు ప్రజాప్రతినిధులైతే స్నేహితులను తీసుకెళ్తారు.
TDP vs Janasena: తిరుపతిలో అనూహ్య పరిణామాలు.. జనసేన పోటీపోటీ సమావేశాలు..! టీడీపీ రహస్య భేటీ..!