Site icon NTV Telugu

Loan Apps New Cheating: అకౌంట్లో డబ్బులు వేస్తారు.. చీటర్ అనే ముద్రతో వేధింపులు

Cyber Fraud

Cyber Fraud

మన అవసరం వారికి అవకాశం.. ఒక్కోసారి మనకు అవసరం లేకున్నా.. మన అకౌంట్లో డబ్బులు వేసి రివర్స్ మనల్ని వేధించడం మామూలైపోయింది. మన అకౌంట్లో డబ్బులు వేసి అకౌంట్ హాక్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆన్లైన్ మనీ యాప్స్ కొత్త తరహా మోసానికి తెరతీస్తున్నారు. ఈ యాప్స్ ఆగడాలతో అమాయకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పోలీసులకు సకాలంలో ఫిర్యాదులు చేస్తే ఎన్నో బలవన్మరణాలకు చెక్ పెట్టవచ్చు, మన అకౌంట్లోకి డబ్బులు పంపి అనుకోకుండా వచ్చాయని చెప్పడంతో అకౌంట్ నుండి డబ్బులు పంపినందుకు బ్యాంక్ అకౌంట్ హాక్ చేస్తున్నారు.

Read Also: Rangareddy Crime: రమ్మంటే రానంటోంది.. భార్యకు వీడియో కాల్‌ చేసి భర్త ఆత్మహత్య

ఆ అకౌంట్ లోని డబ్బులు మాయం చేసి వారి కాంటాక్ట్స్ అందరికి చీటర్ అని మెసేజ్‌లు పంపి రోజూ కాల్స్ చేస్తూ వేధించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని అల్వాల్ సర్కిల్ వెంకటాపురంలో జరిగింది. వెంకటాపురానికి చెందిన ఒక వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఎవరికో పంపే డబ్బులు మీకు పంపామంటూ తిరిగి పంపాలంటూ ఫోన్ చేశారు. బాధితుడు వెంటనే తన అకౌంట్ నుండి డబ్బులు పంపేశాడు. మరల మీకు ఓటీపీలు రెండు వస్తాయి చెప్పాలంటూ లేకపోతే మీ కాంటాక్ట్స్ అందరికి మెసేజ్‌లు పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. స్పందించిన బాధితుడు తన ఫోన్ లోని కాంటాక్ట్ నంబర్స్ అన్నీ పంపాడు. వెంటనే బాధితుడికి వచ్చిన ఓటిపి నెంబర్ లు పంపాడు. వెంటనే బాధితుని అకౌంట్ లో డబ్బులు పోగా కాంటాక్ట్ లో ఉన్నవారందరికి ఇతను చీటర్ అని మెసేజ్ లు వెళ్లాయి. అంతటితో ఆగకుండా నువ్వు యాప్ నుండి లోన్ తీసుకున్నావు తిరిగి చెల్లించాలని నంబర్లు మారుస్తూ వేధింపులకు పాల్పడుతుండగా సోమవారం అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇలాంటి యాప్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు. తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఇలాంటి ఆగడాలకు చెక్ పెట్టడం ఈజీయే అంటున్నారు పోలీసులు.

Read Also: Veer Savarkar vs Tipu Sultan Poster row: కర్ణాటకలో ఉద్రిక్తంగా వీర్ సావర్కర్ వర్సెస్ టిప్పు సుల్తాన్ వివాదం

Exit mobile version