హైదరాబాద్‌కి చెందిన యువతికి భారీ మోసం బారిన పడింది. యువతిని నమ్మంచి రూ.2 కోట్ల 72 లక్షలు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. షాదీ డాట్ కాం సైట్ లో యువతి పరిచయమైన నిందితుడు.. గ్లెన్ మార్క్ ఫార్మా కంపెనీ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన పేరు రిషి కుమార్‌గా యువతికి పరిచయం చేసుకున్నాడు. యువతికి రిషి కుమార్ పెళ్లి ప్రపోజల్ పెట్టాడు.. అందుకు యువతి సైతం ఒప్పుకుంది. అయితే.. తాను కంపెనీ పనిమీద అమెరికా వెళ్తున్నానని.. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నందున వీసా అప్రూవల్ అవడం లేదని యువతిని నమ్మించిన రిషి కుమార్.. కొంత డబ్బు తన అకౌంట్ లో వేయాలని.. సిబిల్ స్కోర్ పెరగగానే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పాడు.. దీంతో.. ఇదంతా నిజమని నమ్మిన యువతి పేరు మీద పర్సనల్ లోన్, కార్ లోన్, యువతి క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు దండుకున్నాడు రిషి కుమార్.
యువతి బంధువైన మరో యువకుడికి ఆస్ట్రేలియా లోని మైక్రోసాఫ్ట్ కంపెనీ లో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పిన రిషి కుమార్.. యువకుడితో మైక్రోసాఫ్ట్ బోర్డ్ మెంబర్ నిర్మల అంటూ ఓ మహిళ తో ఫోన్ కాల్ లో మాట్లాడించాడు. రిషి ని పూర్తిగా నమ్మిన యువకుడు, యువతి.. యువకుడి పేరు మీద కూడా పలు బ్యాంకుల్లో లోన్ రూపంలో డబ్బులు తీసుకున్నారు నిందితులు. కొన్ని రోజులుగా రిషి కాంటాక్ట్ లో లేకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో తన నెంబర్స్ పనిచేయకపోవడంతో.. మోసపోయామని గ్రహించిన యువతి, యువకుడు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరి నుంచి 2 కోట్ల 72 లక్షలు రిషి కుమార్ దండుకున్నాడు. రిషి కుమార్ సొంత పేరు శ్రీ బాల వంశీ కృష్ణ.. రకరకాల పేర్లతో తో మోసాలకు పాల్పడుతున్న వంశీ కృష్ణ విజయవాడ, పెనమలూరు కు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. మ్యాట్రి మోని సైట్ల ద్వారా అమాయక యువతులకు గాలం వేస్తూ.. వంశీ కృష్ణ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు.