Karimnagar: ‘నేను నాగకన్యను.. నాకు గుడి కట్టండి’.. యువతి వింత ప్రవర్తన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagakanya In Karimnagar District: కరీంనగర్ జిల్లాలోని ఓ యువతి వింతగా ప్రవర్తించింది. తనను నాగదేవత ఆవహించిందని.. తనకు గుడికట్టాలని అంటోంది. అంతేకాకుండా ఆమె నాగినిలా నాట్యం చేస్తోంది. తన శరీరంపై గీతలు ఏర్పడుతున్నాయని చూపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్ పూర్‌కు చెందిన యువతి కృష్ణవేణి ప్రవర్తన ఇప్పుడు గ్రామం మొత్తం చర్చనీయాంశంగా మారింది. కృష్ణవేణి డిగ్రీ వరకు చదివి ప్రైవేట్ స్కూలులో టీచరుగా పని చేస్తోంది. తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. దీంతో ఆమె నానమ్మ దగ్గర నివసిస్తోంది. అయితే నాలుగేళ్లుగా యువతి తాను నాగకన్యను అంటూ వింతగా ప్రవర్తిస్తోంది.
Read Also: Waltair Veerayya: మూల విరాట్ ఆంధ్రాలో… మాస్ మహారాజ్ తెలంగాణాలో…
Also Read
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
కాగా చాలా ఏళ్ల క్రితమే తాను నాగకన్యగా మారానని కృష్ణవేణి గ్రామస్తులకు చెప్తోంది. తన కలలో పాములు కనిపిస్తున్నాయని కూడా వివరిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామశివారులో ఉన్న నాగదేవత వద్ద కూలిపోయిన ఆలయాన్ని తిరిగి నిర్మించాలని, అప్పుడే తనలో ఉన్న నాగదేవత వదిలి వెళ్లిపోతుందని కృష్ణవేణి పట్టుబడుతోంది. అయితే కొందరు కృష్ణవేణిని సమర్ధిస్తుండగా మరికొందరు మాత్రం ఆమె ప్రవర్తన తేడాగా ఉందని కొట్టిపడేస్తున్నారు. కృష్ణవేణి మానసిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. అందుకే ఇలా వింతగా ప్రవర్తిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
-
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!