NTV Telugu Site icon

Tsrtc Independence Day Special Offers: ఆగస్టు15న పుట్టిన వారికి 12 ఏళ్లు వచ్చే వరకు ఉచిత ప్రయాణం

Tsrtc Independence Day Special Offers

Tsrtc Independence Day Special Offers

తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్లతో ప్రయాణికుల మనస్సులను గెలుచుకుంటోంది. ఇప్పటికే అనేక ఆఫర్లు ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా.. తెలంగాణ ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఆగస్టు 15న పుట్టిన చిన్నారులందరికీ 12 సంవత్సరాలు వచ్చే వరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులకు ఆగస్టు 15న ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొంది. దీంతోపాటు రూ.120 టీ24 బస్‌ టికెట్‌ను ఆగస్టు 15న రూ.75కే విక్రయించనున్నట్టు వివరించింది.

read also: Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

రేపటి నుంచి (ఈ నెల 10వ) తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈనేపథ్యంలో..ఇవాళ్టి నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించనున్నట్టు తెలిపింది. ఇక ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో జాతీయ పతకాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో, ఉద్యోగులందరూ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ బ్యాడ్జీలతోనే విధులకు హాజరవుతారు. కాగా.. వీటితోపాటు మరిన్ని ఆఫర్లను కూడా టీఎస్ఆర్టీసీ ప్రకటించిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.