Tsrtc Independence Day Special Offers: ఆగస్టు15న పుట్టిన వారికి 12 ఏళ్లు వచ్చే వరకు ఉచిత ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్లతో ప్రయాణికుల మనస్సులను గెలుచుకుంటోంది. ఇప్పటికే అనేక ఆఫర్లు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా.. తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 15న పుట్టిన చిన్నారులందరికీ 12 సంవత్సరాలు వచ్చే వరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులకు ఆగస్టు 15న ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొంది. దీంతోపాటు రూ.120 టీ24 బస్ టికెట్‌ను ఆగస్టు 15న రూ.75కే విక్రయించనున్నట్టు వివరించింది.
read also: Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
రేపటి నుంచి (ఈ నెల 10వ) తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈనేపథ్యంలో..ఇవాళ్టి నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించనున్నట్టు తెలిపింది. ఇక ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో జాతీయ పతకాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో, ఉద్యోగులందరూ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ బ్యాడ్జీలతోనే విధులకు హాజరవుతారు. కాగా.. వీటితోపాటు మరిన్ని ఆఫర్లను కూడా టీఎస్ఆర్టీసీ ప్రకటించిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
Come Let's celebrate #AzadiKaAmritMahotsav with #TSRTC #75thIndependenceDay Special Buses rolling out on roads from today #HarGharTiranga pic.twitter.com/kmZ1SUt19E
— Managing Director – TSRTC (@tsrtcmdoffice) August 8, 2022
తాజావార్తలు
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
-
OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!