Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Mahabubnagar

Off The Record: పేటలో “రాజకీయ దందాలు”.. కోడలు ఎమ్మెల్యే.. పెత్తనం మాత్రం మేనమామదే!

Published Date :December 27, 2025 , 10:49 pm
By RAMAKRISHNA KENCHE
  • కర్ణాటక నుంచి ధాన్యం తీసుకొచ్చి నారాయణపేట మార్కెట్‌లో అమ్మకం
  • బోనస్‌ను సొమ్ము చేసుకోవడంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివా రెడ్డి కీలకం
  • పోలీసు, రెవెన్యూతో సహా కీలక శాఖలను శాసిస్తున్న శివకుమార్ రెడ్డి
Off The Record: పేటలో “రాజకీయ దందాలు”.. కోడలు ఎమ్మెల్యే.. పెత్తనం మాత్రం మేనమామదే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆమె తన మేనమామే కదా అని వదిలేసినట్టుంది. ఆయనేమో తన మేనకోడలు ఎమ్మెల్యే అంటూ తెగ రెచ్చిపోతున్నారు. నియోజకవర్గానికి తానే కింగ్‌ మేకర్‌ అంటూ పోజులు కొడుతున్నారు. మరి…అక్కడ కోడలు ఎమ్మెల్యే అయితే మామ పెత్తనమే కొనసాగుతోందా? వందా యాభై చందాల నుంచి మొదలుపెట్టి రాజకీయ దందాలు చేస్తున్నదెవరు?ఇంతకీ…ఎవరా మామా కోడళ్లు?ఆ జిల్లాలో ఆ నియోజకవర్గం పేరే ఎందుకు ప్రముఖంగా వినిపిస్తోంది?

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట అసెంబ్లీ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల వేళ అనూహ్యంగా తెరపైకి వచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించారు డాక్టర్ పర్ణికా రెడ్డి. ఆమె కుటుంబ నేపథ్యం పొలిటికల్‌గా బలమైందే. అయినప్పటికీ ఆమెకు మాత్రం రాజకీయాలు కొత్త. కొన్నేళ్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే కోరికతో ఉన్న కుంభం శివకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పర్ణికా రెడ్డికి మేనమామ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. మారిన పరిణామాలతో తాను సైడైపోయి…డాక్టర్ వృత్తిలో ఉన్న మేనకోడలు పర్ణికా రెడ్డిని రంగంలోకి దించారు.

ఇక…ఇప్పుడు పర్ణికారెడ్డిని అన్నీ తానై ఎమ్మెల్యేగా గెలిపించిన శివకుమార్ రెడ్డి నియోజకవర్గాన్ని అంతా తన గుప్పిట్లో పెట్టుకొని శాసిస్తున్నట్లు లోకల్ టాక్. తాను ఏ పదవిలో లేకున్నా నారాయణపేటలో శివకుమార్ రెడ్డి కింగ్ మేకర్‌గా మారిపోయారట. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఏ పనీ కాదని క్యాడర్, ముఖ్యకార్యకర్తలు సైతం చెప్పుకుంటూ ఉంటారని తెలుస్తోంది. శివకుమార్ రెడ్డి ఫోన్ వెళ్లనిదే అధికారులు ఎవరూ పని చేయరని కాంగ్రెస్ శిబిరంలోని నేతలు చర్చించుకుంటున్నారట. శివకుమార్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడు అరుణ్ సైతం దందాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

పర్ణికా రెడ్డి గెలుపొందిన వెంటనే…నియోజకవర్గ పరిధిలో ఇల్లీగల్ దందాలన్నింటిపైనా శివకుమార్ రెడ్డి మనుషులు వాలిపోయినట్లు తెలుస్తోంది. ఇసుక అక్రమంగా తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికల్ మండలంలోని వాగు నుంచి, రాకొండ, పూసలపాడ్ గ్రామాల నుంచి ఇసుక కొల్లగొట్టడంలో శివకుమార్ రెడ్డి అనుంగు శిష్యుడు అరుణ్‌దే కీలక పాత్ర అని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ధన్వాడ పెద్ద చెరువు నుంచి ఒండ్రు మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటుక బట్టీలు అమ్మి సొమ్ము చేసుకోవడంలో పీఎస్ మాధవరెడ్డిది కీ రోల్ అని తెలుస్తోంది. ఆయా మండలాల్లో కల్లు దందా అంతా ఆయన అనుచర వర్గమే చేస్తున్నట్లు సమాచారం.

మరోపక్క పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి ధాన్యం తీసుకొచ్చి నారాయణపేట మార్కెట్‌లో అమ్మి బోనస్‌ను సొమ్ము చేసుకోవడంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి కీలకమనే ప్రచారం నడుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ కూడా శివకుమార్ రెడ్డి కనుసన్నల్లోనే సాగుతాయట. ఆయన అండదండలు లేకుంటే ఇలాంటి పనులు అసాధ్యమని కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. నారాయణపేటలో పోలీసు, రెవెన్యూతో పాటు పలు కీలక శాఖలను శివకుమార్ రెడ్డి శాసిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ నిర్ణయమైనా అధికారులు శివకుమార్ రెడ్డినే కాంటాక్ట్ అవుతున్నారట. ఆయా పీఎస్‌లకు ఎస్ఐలుగా శివకుమార్ రెడ్డి సూచించిన వాళ్లనే నియమించినట్లు తెలుస్తోంది. సెటిల్మెంట్లు సైతం ఆయన కనుసన్నల్లోనే సాగడం పరిపాటిగా మారిందనేది నారాయణపేట నియోజకవర్గ ప్రజల మాట.

అసెంబ్లీ ఎన్నికల్లో పర్ణికారెడ్డి 7 వేల 951 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె కుటుంబ రాజకీయ నేపథ్యం…శివకుమార్ రెడ్డి అన్ని తానై నడిపించడంతో విజయం ఆమె సొంతం అయ్యింది. దీనికి తోడు రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటి చేసి రెండో స్థానానికి పరిమితమైన శివకుమార్ రెడ్డిపై సింపతీ కూడా పర్ణికారెడ్డికి కలిసొచ్చినట్లు చెప్పవచ్చు.

మొత్తం మీదా నారాయణపేట నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అన్నట్లుగా ఏలుతున్నారట శివకుమార్ రెడ్డి. ఆయన సూచనలతోనే ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి…శివకుమార్ రెడ్డి అండ్ టీం మా టైమ్‌ వచ్చిందన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mahabubnagar
  • ntv
  • OTR

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions