Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
- తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
- బెంగాల్లో పార్టీ పెద్దలు పడుతున్న కష్టంతో పోలిక
- కష్టపడి గెలిపిస్తే పదవులు మీకేకదా... అంటూ చర్చలు
- స్టేట్ లీడర్స్ ఇగోకి పోతూ అవకాశాలు వదులుతున్నారన్న అభిప్రాయం
వీళ్ళని ఎక్కడికో….. తీసుకెళదామని వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. కానీ వీళ్ళు మాత్రం మేం ఇక్కడే ఉంటాం, పైగా ఇలాగే ఉంటామన్నట్టు వ్యవహరిస్తుంటారు. ప్లాన్ చేస్తాం… అందలం ఎక్కిస్తామని అంటున్నా… అలా ఎక్కాలన్నా…. ఎంత కొంత కష్టపడాలి కదా…? ఆ కష్టం కూడా మా వల్ల కాదంటారు. మాలో మేం తన్నుకుంటూ గుద్దుకుంటూ ఇలాగే టైం పాస్ చేస్తాం తప్ప… నెక్స్ట్ లెవల్ ట్రై చేసే ప్రసక్తే లేదన్నట్టుగా ఉంటారు. ఇంతకీ… వాళ్ళెవరు..? వీళ్ళెవరు..? ఏ పార్టీలో ఉందా పరిస్థితి? అక్కడ ఆ నేతలు చెమటోడుస్తున్నారు. బీజేపీ అగ్ర నేతలంతా పశ్చిమ బెంగాల్లో వాలిపోయి పార్టీకి పవర్ కోసం ప్లాన్ చేస్తున్నారు, కాలికి బలపం కట్టుకుని తిరిగారు. అదంతా కేవలం పార్టీ కోసమే. అధికారం కలగా మిగిలిపోయిన రాష్ట్రంలో పార్టీని పవర్లోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా మోడీ, అమిత్ షా నుంచి పార్టీ ముఖ్యనేతలంతా బెంగాల్ బాట పట్టారు. అదో డిఫరెంట్ స్టోరీ. కానీ… దాంతో లింక్ పెట్టి చూస్తూ… తెలంగాణ బీజేపీ నేతల తీరును సొంత పార్టీ కేడరే ఎండగడుతోంది. వ్యక్తిగతంగా వాళ్ళకు అక్కడ పదవులతో పని లేకున్నా… పార్టీని అధికారంలో నిలపాలన్న తాపత్రయంతో పెద్దోళ్ళంతా అలా కష్టపడుతున్నారు. కానీ…. ఇక్కడ తెలంగాణలో పార్టీని నిలిపి గెలిపిస్తే… ముఖ్యమంత్రి నుంచి మంత్రి పదవుల దాకా… వీళ్ళకే కదా… వస్తాయి, అయినా సరే… రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారు, కనీస యాక్టివిటీ కూడా ఎందుకు ఉండటం లేదని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో చర్చ జరుగుతోంది. పైగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇక్కడ పార్టీని గెలిపిస్తే… తమకు పదవులు వస్తాయని తెలిసి కూడా ఇగోకి పోతూ… ఉన్న అవాకాశాలను కూడా ఉపయోగించుకోవడం లేదని అంటున్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా… కమలంలోని పెద్దలు అక్కడ వాలిపోతారు.
గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తారు. అక్కడి కేడర్‌లో భరోసా నింపే ప్రయత్నం చేస్తారు. ఆ రూపంలో పార్టీకి ఊపు వస్తుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో జరుగుతోంది కూడా ఇదే. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా…బెంగాల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చెప్పులరిగేలా తీరుగుతున్నారని చెప్పుకోవచ్చు. బీజేపీకి చెందిన మిగతా అగ్ర నాయకులు కూడా అదే స్థాయి ఫోకస్ పెట్టారు. సరిగ్గా ఈ పాయింట్‌నే లేవనెత్తుతూ తెలంగాణ బీజేపీ నాయకులు వాళ్లని చూసి ఎప్పుడు నేర్చుకుంటారంటూ డిస్కస్ చేసుకుంటున్నారు కింది స్థాయిలో. బెంగాల్లో గెలిస్తే…పార్టీ ఖాతాలోకి మరో రాష్ట్రం వస్తుంది. అంతే తప్ప… నేషనల్ లీడర్స్ అందరికీ అక్కడేం పదవులు రావు, ప్రత్యేకంగా ఒరిగేదేం లేదు. అయినా సరే వాళ్ళంతా అంత కష్టపడుతుంటే… ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి పీఠం సహా… రకరకాల పదవులు రాష్ట్ర నేతలకే దక్కే అవకాశం ఉన్నా… ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారంటూ ఫైరైపోతున్నారు. పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని పెద్దవాళ్ళు పడుతున్న తాపత్రయం… తిరుగుతున్న తీరు… తెలంగాణ నేతలకు కనిపించడం లేదా అన్న ప్రశ్న వస్తోంది కేడర్ నుంచి. వాళ్లని చూసైనా…. మా నాయకులు ఇగోలు పక్కన పెట్టాలని అంటున్నారు. పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్న నేషనల్ లీడర్స్‌కు, పార్టీ కన్నా మేమే గొప్ప అనుకుంటున్న స్టేట్ నాయకులకు చాలా తేడా ఉందని, ఆ సంగతి గమనించుకుని ఇకనైనా రాష్ట్ర పార్టీ నాయకులు మారితేనే తెలంగాణలో వాళ్ళకైనా, పార్టీకైనా భవిష్యత్ అన్నది కార్యకర్తల మాట. క్షేత్ర స్థాయిలో పని చేయడానికి మేం సిద్ధంగా ఉన్నా…నడిపించడానికి వాళ్లు రెడీగా లేరు, ఆ ఇగోలతో ఎన్నాళ్లని నడిపిస్తారని సొంతోళ్ళే మాట్లాడుకుంటున్నారు. మారండయ్యా….. ఇకనైనా మారిపోండయ్యా….. పై వాళ్ళని చూసి నేర్చుకోండయ్యా….. అంటున్న తెలంగాణ బీజేపీ కార్యకర్తల మాటను రాష్ట్ర నాయకులు ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటారో చూడాలి.
Also Read
- Tags
- bjp
- NTV Telugu
- off the record
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!