Nampally Exhibition: నాంపల్లిలో జనవరి 1 నుంచి నుమాయిష్.. టికెట్ ధర ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nampally Exhibition:ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్)కి సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 1న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 83వ నుమాయిష్ ప్రారంభోత్సవానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ దాదాపు 2,400 స్టాల్స్ కొలువుదీరనున్నాయి. ఎగ్జిబిషన్‌లో ఒకే చోట అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. నగరంలో అందుబాటులో లేని అనేక రాష్ట్రాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. దుస్తులు, మంచాలు, వంట సామాగ్రి, మహిళల కోసం వంటసామగ్రి, దుప్పట్లు, బెడ్‌షీట్లు, కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొత్త ఫర్నిచర్, మల్టీ పర్పస్ ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి.
Read also: Medak Student: విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్.. అర్ధనగ్నంగా హంగామా..!
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
టిక్కెట్ ధర రూ.40.
దాదాపు 22 లక్షల మంది ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారని అంచనా. ఎగ్జిబిషన్ సొసైటీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులను గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. టిక్కెట్ ధర రూ.40 ఉండనుంది. అనేక వినోద విభాగాలు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి ఎనుగుల రాజేందర్ కుమార్ మాట్లాడుతూ సందర్శకులకు కనువిందు చేస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. క్రీడా పోటీలు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను నెలకొల్పుతూ విద్యావ్యాప్తికి నిరంతరం తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. 33 సబ్ కమిటీల ద్వారా ప్రదర్శనను విజయవంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ లోపల, బయట సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎగ్జిబిషన్ సబ్ కమిటీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.
Extreme Cold in Telangana: తెలంగాణపై చలి పంజా.. జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు
తాజావార్తలు
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
-
Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!