Nizamabad Crime: కుటుంబం మొత్తం ఆత్మహత్యా యత్నం చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా బాసరలో కలకలం రేపుతుంది. ఈ ఘటనలో తండ్రి, కూతురు గల్లంతు కాగా.. కొందరు జాలర్లు తల్లిని కాపాడారు.
అసలు ఏం జరిగింది..
నిజామాబాద్ జిల్లా న్యాల్ కల్ మండలంలో వేణు, అనురాధ కుంటుంబం నివాసం ఉంటుంది. వీరికి పూర్ణ అనే కూతురు కూడా ఉంది. అయితే వేణు కొద్దిరోజుల క్రితం అవసరాల నిమిత్తం ఓ వడ్డీ వ్యాపారస్తుని వద్ద వడ్డీకి రూ.3 లక్షలు తెచ్చుకున్నాడు. వేణు నెల నెల డబ్బులు కట్టకపోవడంతో వడ్డీవ్యాపారుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. వడ్డీతో సహా చక్రవడ్డీ కూడా చెల్లించాలని వేణుని వేధించడం మొదలు పెట్టారు వ్యాపారస్తుడు. కొంత సమయం కావాలని కోరినా వడ్డీ వ్యాపారులు వినలేదు. రోజు రోజుకు వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో అవమానం భరించలేక కుటుంబంతో సహా బాసర గోదావరి వద్దకు వచ్చాడు. అనంతరం వేణు, తన భార్య అనురాధ, కూతురు పూర్ణతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు.
Read also: Half Day Schools: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు.. కారణం అదేనా.?
ఇంతలో అక్కడే వున్న కొందరు జాలర్లు వారిని గమనించి వెంటనే వారిని కాపాడేందుకు వెళ్ళారు. అయితే అనురాధను కాపాడు కానీ.. వేణు, కూతురు పూర్ణ గల్లంతయ్యారు. దీంతో జాలర్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనురాధను మెరుగైన చికిత్సకోసం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక గోదావరిలో దూకి ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు అనూరాధ వెల్లడించింది. రూ. 3 లక్షల అప్పు వడ్డీతో సహా చెల్లించిన చక్ర వడ్డీ చెల్లించాలని వడ్డీ వ్యాపారుల వేధింపులు ఎక్కవయ్యాయని. ఇది సహించలేకనే కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనూరాధ పోలీసులుకు తెలిపారు. వడ్డీ వ్యాపారస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Bhatti Vikramarka: మల్లు భట్టి విక్రమార్కను అభినందించిన ఐరన్, స్టీల్ అసోసియేషన్..