Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories People Big Fight For Mutton Curry In The Wedding Feast At Nizamabad Navipet

Fight For Mutton Curry: పెళ్లి విందులో ‘మటన్’ పంచాయతీ.. గరిటెలు, రాళ్లు, కర్రలతో దాడి.. పరస్పరం కేసులు..

Published Date :August 29, 2024 , 11:14 am
By Sudhakar Ravula
  • పెళ్లి విందులో మటన్ కర్రీ కోసం పంచాయతీ..
  • పెళ్లి విందులో రసాభాస..
  • మాంసాహారం కోసం వరుడు.. వధువు బంధువుల పరస్పరం దాడులు..
  • 19 మందిపై కేసులు నమోదు..
Fight For Mutton Curry: పెళ్లి విందులో ‘మటన్’ పంచాయతీ.. గరిటెలు, రాళ్లు, కర్రలతో దాడి.. పరస్పరం కేసులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Fight For Mutton Curry: పెళ్లితో పాటు కొన్ని శుభకార్యాల్లో నాన్‌వెజ్‌ కోసం గొడవలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. మాకు మటన్‌ సరిగా వడ్డించలేదని.. చికెన్‌ తగినంత వేయలేదని.. ఇదేనా పెళ్లి కొడుకు తరఫు బంధువులను చూసుకునే విధానం.. ఇదేనా.. పెళ్లి కూతురు బంధువులకు ఇచ్చే మర్యాదా అంటూ.. రకరకాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. అయితే, తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో మటన్ ముక్కలు పంచాయితీ పెట్టాయి.. పెళ్లి విందులో రసాభాసకు కారణంగా మారాయి.. పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరపు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్నారు.. అంతేకాదు.. 19 మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయి..

Read Also: Viral Video: వామ్మో.. ఇలాంటి వారితో జాగ్రత్త సుమీ..

నిజామాబాద్ జిల్లా నవీపేటలో బుధవారం చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో వివాహం జరిపించారు. అనంతరం విందులో.. వరుడు తరఫు నుంచి వచ్చిన కొందరు యువకులకు మాంసాహారం వడ్డించారు. కానీ, మటన్ ముక్కలు తక్కువ వేశారంటూ.. వడ్డించే వ్యక్తులతో ఆ యువకులు వాగ్వాదానికి దిగారు. దీనిపై వధువు బంధువులు కల్పించుకోవడంతో ఇరు పక్షాల మధ్య గొడవ తీవ్రమైంది. వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడటంతో కొంతసేపు ఉద్రిక్తత నెల కొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. ఒక వర్గానికి చెందిన ఈర్నాల సత్యనారాయణతో పాటు మరో 11 మంది, మరో వర్గానికి చెందిన పత్రి సాయిబాబాతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.. గాయపడిన ఎనిమిది మందిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bride
  • Fight For Mutton Curry
  • groom
  • mutton curry

తాజావార్తలు

  • Dacoit: ‘డెకాయిట్’ సెన్సార్ రివ్యూ

  • Mushroom Curry Recipe: చికెన్ కర్రీ ఎందుకు..? మష్రూమ్ కర్రీ ఉండగా.. సూపర్ సాఫ్ట్ గా చేసేయండి ఇలా..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Post Jobs: పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు..

  • Thalapathy Vijay: దళపతి విజయ్‌కు భారీ షాక్.. ఆ స్థానంలో ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న టీవీకే!

ట్రెండింగ్‌

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions