MP Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Arvind: తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఎన్నికలకు సంబంధించి బీజేపీ సీనియర్ నేతలు ఇప్పటికే ముఖ్య నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకం చేసేందుకు బీజేపీ నాయకత్వం కూడా సిద్ధమైంది. ఇందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఎంపీకి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఎంపీ అరవింద్. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎంపీ అరవింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది.
Read also: PSLV-C56: మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఒకేసారి ఏడు ఉపగ్రహాలు నింగిలోకి..
Also Read
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కేసీఆర్ బ్రతికున్నంత కాలం మీకు ఇల్లు రావని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం స్కాములు తప్ప ఏమి చేయదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కు వచ్చిన 10 వేల కోట్లను కవితకు ఇచ్చాడని ఆరోపించారు. అవి తీసుకెళ్లి ఢిల్లీ లిక్కర్ లో పెట్టిందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పెట్టుకున్న సంబంధాలతో సిసోడియా జైలుకు వెళ్ళాడని అన్నారు. ఏపీలో తెలంగాణ కంటే అద్భుతమైన ఇళ్లు కట్టారని అన్నారు. ఏపీలో 8 లక్షల ఇళ్లను నిర్మించారని తెలిపారు. ప్రపంచంలో కవిత అతి పెద్ద అవినీతి పరురాలు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నా ముక్కు నేలకు రాయాలటమా.. నా చెప్పు కూడా రాయను అని అన్నారు. ఈమె పెద్ద ఐరన్ లెగ్.. మీ నాన్న ముక్కు నెలకు రాపిస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీమ్ గల్ లో బస్ డిపో కట్టడానికే డబ్బులు లేవు అని మంత్రి ఆర్టీసీ చైర్మన్ చెపుతున్నారని గుర్తు చేశారు. బస్ డిపో కట్టని వాళ్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నారని వ్యంగాస్త్రం వేశారు. గంజాయి విషయంలో తన కుటుంబ సభ్యులు, పాలోవర్స్ చేస్తున్నారు అని తనే ఒప్పుకున్నాడని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే అభివృద్ధి చేస్తున్నారని మొన్న బయటపెట్టాక ఒప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో తిరగడానికి ఒక్కో అధ్యక్షునికి 10 లక్షలు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కవిత నాపై పోటీ చేయను అంటుంది, సో నీ దారి నువ్వు చుస్కో.. నా దారి నేను చూసుకుంటా అని అరవింద్ అన్న మాటలు ఇప్పుడు దుమారాన్ని రేకెత్తించాయి. ఎమ్మల్సీ కవిత చేసిన సవాల్ కు అరవింద్ ఇచ్చిన సమాధానంపై కవిత ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠత నెలకొంది.
Milk Gang Arrest: మేడ్చల్ అడ్డాగా కల్తీ పాల దందా.. ముఠా గుట్టు రట్టు..
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!