Iron Wire in Biscuit: బిస్కెట్ లో ఇనుప తీగలు ప్రత్యక్షమైన ఘటన కామారెడ్డిలో కలకలం రేపుతుంది. అమీర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్ వద్ద ఒక మెట్రో ప్రయాణీకుడు దుకాణంలో కొన్న చాక్లెట్ లో పురుగులు గుర్తించిన ఘటన మరువక ముందే ఇప్పుడు బిస్కెట్ లో ఇనుప తీగ రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో స్థానికంగా ఉన్న దుకాణం నుంచి హనుమాన్ రెడ్డి అనే వ్యక్తి తన పిల్లల కోసం బార్‌బన్ బిస్కెట్లు తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన తండ్రి పిల్లలకు ఆ బెస్కెట్ ప్యాకెట్ తిన మని చేతికి ఇచ్చాడు.
పిల్లలు బిస్కెట్ తింటున్న సమయంలో అందులో సన్నని ఇనుప తీగ కనిపించింది. ఆ బిస్కెట్ ను చేతిలో తీసుకుని వీడియో తీశాడు. చిన్న పిల్లలకు బయటనుంచి ఏదైనా తినేకి తెచ్చినప్పుడు ముందుగా తల్లిదండ్రులు పరిశీలించి ఆ తరువాత వారికి ఇవ్వాలని కోరాడు. ఎక్స్ వేదికగా కలుషితమైన ఈ బిస్కట్ల వీడియోను షేర్ చేస్తూ ఇలాంటి కలుషితమైన ఉత్పత్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ బిస్కెట్లు బ్రిటానియా కంపెనీకి చెందిన బోర్బన్ బిస్కెట్లు అని అతను పేర్కొన్నాడు. అతను బిస్కెట్ ప్యాకెట్ ను చూపిస్తూ వీటిని తినవద్దని హెచ్చరించారు.
Panthangi Toll Plaza: దసరా ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్..