NTV Telugu Site icon

CM KCR: ఎన్నికలు రాగానే ఆగం ఆగం అబద్ధాలు చెబుతారు.. ఆలోచించి ఓటు వేయండి

Kcr

Kcr

ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగం ఆగం అబద్ధాలు చెబుతారని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి, ఎవ్వరో ఒక్కరు గెలుస్తారని చెప్పారు. ఎన్నికల్లో నిలబడే వ్యక్తి ఎవ్వరో చూడాలని.. ఏ పార్టీ చరిత్ర ఏంటో చూడాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఓటు వజ్రాయుధం.. ఆలోచించి ఓటు వేయాలని ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ 50 ఏళ్లు పాలించిది. తరువాత టీడీపీ, టీఆర్ఎస్ పదేళ్లు ఉందని కేసీఆర్ అన్నారు. ఏ పార్టీ ఏంటో చూడాలని.. చరిత్ర ముందు ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతు బంధు దుబారా అని.. మూడు గంటల కరెంట్ అని రేవంత్ అంటున్నారని తెలిపారు. మహారాష్ట్రలో లైట్ లేదు మన దగ్గర లైట్ ఉందని చెప్పారు. తెలంగాణలో ఒకప్పుడు జనం వలసలు పోయేదని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు.

Bhatti Vikramarka: తెలంగాణ కోసం కన్న కలలు నెరవేరలేదు..

వ్యవసాయ స్థిరీకరణ కోసం మేదావులతో చర్చించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ధరణి రాక ముందు లంచాల రాజ్యం నడుస్తుండేదని.. ఇప్పుడు నిమిషాల్లోనే పట్టాలు చేతికి వస్తాయని పేర్కొన్నారు. రాహూల్ నుంచి భట్టి వరకు ధరణి తీసేస్తం అంటున్నారన్నారు. దళారీ వ్యవస్థ లేదు.. అదే రాజ్యం రావాలా ఇదే రాజ్యం ఉండాలా అని కేసీఆర్ చెప్పారు. ఇదిలా ఉంటే.. గడ్డెన్న ప్రాజెక్టు ద్వారా టీఆర్ఎస్ రాక ముందు 4వేల ఎకరాలకు నీరు అందేదని తెలిపారు. ఇప్పుడు 12 వేల ఎకరాలకు నీరు ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 24 గంటల కరెంట్ తో బ్రహ్మాండమైన పరిస్థితులున్నాయని తెలిపారు. రైతు బంధు సహాయంతో అప్పులు తీర్చుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.

Eswar Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత

మరోవైపు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అంత ప్రైవేట్ చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టుతానన్నారు. నేను వద్దు అన్నా.. నిధులు కట్ చేసారని తెలిపారు. అయినా వ్యవసాయం బాగుపడాలని మీటర్లు పెట్టలేదు పెట్టబోమన్నారు. దీంతో 25వేల కోట్లు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వలేదు కట్ చేశారన్నారు. ఒక్క 3 మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఏవి ఇవ్వని బీజేపీ ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుందో మీరు అడగాలని అక్కడికి వచ్చిన జనాలకు సూచించారు. బీఆర్ఎస్ కు కులం, మతం లేదన్నారు. కాంగ్రెస్ దళితుల గురించి ఆలోచించలేదని తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ ఆలోచించి ఉంటే దళితులకు ఈ పరిస్థితి ఉండేదా అని కేసీఆర్ పేర్కొన్నారు. భైంసా అంటే ఏదో అని అబద్ధాలు చెప్పారని..
అన్ని కులాలు, మతాలు కలసి ముందుకు పోవాలని కేసీఆర్ తెలిపారు.