Eswar Rao: టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వర్ రావు మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. అక్టోబర్ 31 న ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మృతిచెందినట్లు సమాచారం. స్వర్గం- నరకం అనే సినిమాతో ఈశ్వర్ రావు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమాతోనే కాంస్య నంది అవార్డును అందుకున్నాడు.
Amit Shah: మరోసారి ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ?
ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించాడు. దాదాపు 200 కు పైగా సినిమాల్లో నటించిన ఈశ్వర్ రావు.. కొంతకాలం తరువాత సినిమాకు దూరమయ్యారు. ఇక ఆయన నటించిన సినిమాల్లో దేవతలారా దీవించండి, ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి లాంటి సినిమాలు మంచిపేరును సంపాదించి పెట్టాయి. ఇక ఈశ్వర్ రావు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.