New Ration Cards: తెలంగాణలో ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న పేదల కల సాకారం కాబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. డిసెంబరు 28 నుంచి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు.దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలపై గ్రామసభలో తీర్మానం చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) సమావేశం సోమవారం (డిసెంబర్ 18) హైదరాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, కాంగ్రెస్ నేతలకు రేషన్‌కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించిన కీలక వివరాలను మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరించి గ్రామసభలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఉన్న కార్డుల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తుదారులు నిరీక్షిస్తూనే ఉన్నారు. రేషన్‌తోపాటు ఆరోగ్యశ్రీ, ఇతర సేవలకు రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్త రేషన్‌కార్డులు ఇవ్వకపోవడంతో లక్షలాది మంది పేదలు సేవలు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య చికిత్స పరిమితిని రూ. 10 లక్షలకు పెంచారు. కొత్త రేషన్‌కార్డులు ఇవ్వకపోవడంతో తమ పిల్లల పేర్లు చేర్చే అవకాశం లేకపోవడంతో వేలాది కుటుంబాలకు ఉచిత బియ్యం అందకుండా పోయాయి. కొత్త రేషన్‌కార్డుల కోసం ఒక్కో జిల్లాలో దాదాపు 50 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో జిల్లాలో రేషన్ కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు కోసం 60 వేల నుంచి 90 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.
Rice Price Hike: భారీగా పెరిగిన బియ్యం ధరలు.. రంగంలోకి దిగిన ప్రభుత్వం