Site icon NTV Telugu

Presidential Polls 2022: ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ పర్యటన రద్దు.. కారణం అదేనా..?

Draupadi Murmu

Draupadi Murmu

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము.. షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించాల్సి ఉన్నా.. తన పర్యటనను రద్దుచేసుకున్నారామె.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కి ఆమె చేరుకోవాల్సి ఉంది.. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో రాష్ట్రపతి అభ్యర్థికి ఘనస్వాగతం పలికిచేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది.. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు సోమజిగూడలోని ఓ హోటల్‌లో మేధావులతో సమావేశం, ఆ తర్వాత బీజేపీ ముఖ్యనేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు.. తిరిగి రాత్రి 7.40 గంటలకు తిరిగి వెళ్లే విధంగా షెడ్యూల్‌ రూపొందించారు.. కానీ, చివరి గంటల్లో ఆమె పర్యటన వాయిదా వేసుకున్నారు.. సమయాభావం వల్ల ద్రౌపది ముర్ము తెలంగాణకు రాలేకపోతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న ద్రౌపది ముర్ము… సమయాభావం వల్ల హైదరాబాద్ రాలేకపోతున్నట్టు చెబుతున్నారు..

Read Also: Andhra Pradesh: నేటి నుంచి సింహాచలంలో గిరి ప్రదక్షిణలు.. 4 లక్షల మంది హాజరయ్యే అవకాశం

మరోవైపు, ఇవాళ ఏపీలో పర్యటించనున్నరు ద్రౌపది ముర్ము.. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోన్న ఆమెకు బీజేపీ నేతలు స్వాగతం పలకనున్నారు.. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి ద్రౌపది ముర్ము వెళ్లనున్నారు.. రాష్ట్రపతి అభ్యర్థికి తేనీటి విందు ఇవ్వనున్నారు సీఎం జగన్.. అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ కానున్నారు. మరోవైపు, ఇప్పటికే ఏపీలోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్మకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తెలంగాణ పర్యటన వాయిదా పడడంతో.. దాదాపు ఆమె హైదరాబాద్‌ పర్యటన రద్దు అయినట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే.. ఆమె మరిన్ని రాష్ట్రాల్లో పర్యటించాల్సింది ఉంది.. సమయం లేదు కాబట్టి.. ఆమె ఇక హైదరాబాద్‌ రాకపోవచ్చు అనే చర్చ సాగుతోంది.. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ ఇప్పటికే విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతు ప్రకటించింది.. ఆయనను హైదరాబాద్‌కు రప్పించి ఘనస్వాగతం పలికింది. తెలంగాణ నుంచి ఎన్డీఏ అభ్యర్థికి పడే ఓట్లు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో.. హైదరాబాద్‌ పర్యటనను ఆమె రద్దు చేసుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. కాగా, భారత 16వ రాష్ట్రపతి ఎన్నికలు ఈ నెల 18వ తేదీన జరగనున్నాయి.. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Exit mobile version