NTV Telugu Site icon

రాయలసీమ ఎత్తిపోతల కేసు.. ఎన్జీటీలో విచారణ

NGT

NGT

రాయలసీమ ఎత్తిపోతల కేసులో మరోసారి విచారణ జరిపింది నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ).. ఇవాళ విచారణ సందర్భంగా.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎన్జీటీకి నివేదిక అందజేసింది.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్రవేత్త పసుపులేటి డా. సురేష్ బాబు.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలం వద్ద ఎలాంటి పనులు జరగడం లేదని.. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకువచ్చిన సామగ్రి అంతా ఆ ప్రాంతంలో నిల్వ ఉంచారని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, ప్రస్తుతం ఉన్న పర్యావరణ అనుమతులకు సవరణలు కోరుతూ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కు కూడా అనుమతులను వర్తింపచేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్టుగా తెలిపింది.. అయితే, ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది ఎన్టీటీ. కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య.. కృష్ణా జలాల విషయంలో వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.