Site icon NTV Telugu

ACB : LRS ఫైల్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన మహిళా అధికారిణి

Bribe

Bribe

ACB : హైదరాబాద్ శివారులోని నర్సింగి మున్సిపాలిటీలో ఓ మహిళా అధికారిణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నర్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మణి హారిక మంగళవారం లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, ఓ బాధితుడికి చెందిన LRS (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దస్త్రాలపై సంతకం చేసేందుకు మణి హారిక రూ. 10 లక్షలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఆమెకు ఇప్పటికే కొంత మొత్తాన్ని ముట్టజెప్పినట్లు తెలిసింది. మిగిలిన మొత్తంలో భాగంగా రూ. 4 లక్షలు మంగళవారం తన కార్యాలయంలో స్వీకరిస్తుండగా, ముందుస్తు సమాచారంతో అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, మణి హారికను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Peter Navarro: బ్రిక్స్‌పై విషం చిమ్మిన ట్రంప్ సలహాదారు.. రక్త పిశాచి అంటూ పోస్ట్

Exit mobile version