Peter Navarro: అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్, ఆయన యంత్రాంగం కారణంగా రోజురోజుకు అమెరికాకు ప్రపంచ దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. అమెరికా ప్రస్తుతం తనను తాను ప్రపంచానికి మకుటం లేని రాజుగా భావిస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఏ దేశమూ కూడా దాని నియంతృత్వానికి తలొగ్గడానికి సిద్ధంగా లేదు. ట్రంప్ యంత్రాంగం ప్రపంచంతో సంబంధాలను బలోపేతం చేసుకోడానికి దృష్టి సారించాల్సి ఉండగా, వాళ్లు దానికి బదులుగా మరింత దిగజారేలా మాట్లాడుతున్నారు.
READ ALSO: Narayanan: ఆపరేషన్ సిందూర్‌కి 400 మందికి పైగా శాస్త్రవేత్తల కృషి.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఇటీవల రష్యా – భారతదేశం మధ్య సంబంధాల గురించి సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కారణంగా తర్వాత ఆయన ఎలోన్ మస్క్‌తో ఘర్షణ పడ్డారని సమాచారం. తాజా ఆయన దృష్టి ఇప్పుడు భారతదేశం నుంచి మొత్తం బ్రిక్స్ సంస్థపైకి మళ్లింది. ఈ సంస్థలో భాగస్వాములైన దేశాలపై అమెరికా సుంకాల యుద్ధాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ బ్రిక్స్ దేశాలు ఏవీ కూడా అగ్రరాజ్యం బెదిరింపులకు తలొగ్గడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు.
బ్రిక్స్ దేశాలను విమర్శిస్తూ పీటర్ నవారో తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ సభ్య దేశాలను అమెరికా రక్తాన్ని పీల్చే ‘రక్త పిశాచులు’ అని పేర్కొన్నారు. ఈ దేశాలు అమెరికా మార్కెట్ వల్లే మనుగడ సాగిస్తున్నాయని, అవి అమెరికన్ మార్కెట్లకు వాళ్ల ఉత్పత్తులను అమ్మకపోతే వాటి ఉనికి ప్రమాదంలో పడుతుందని అన్నారు. దీనితో పాటు, బ్రిక్స్ ఐక్యతను ప్రశ్నించారు. ‘ఈ దేశాలు చరిత్రలో ఒకరినొకరు ద్వేషించుకున్నాయి, మరి అవి ఎలా కలిసి ఉండగలవు?’ అని ఆయన అన్నారు. దీనికి పలువురు స్పందిస్తూ.. చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. ఒసామా బిన్ లాడెన్ అమెరికాకు మాయని మచ్చను కలిగించాడని, అయినప్పటికీ నేడు వాళ్లు పాకిస్థాన్‌తో చాలా స్నేహంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. పాక్ లాడెన్‌ను సంవత్సరాలుగా పోషించిన విషయం మర్చిపోయి, వైట్ హౌస్‌లో పాక్ ఆర్మీ చీఫ్‌కు ఆహారం పెడతున్నారని విమర్శలు గుప్పించారు.
భారత్‌పై విమర్శలు..
పీటర్ నవారో మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక దిగుమతి సుంకాన్ని విధిస్తుందని అన్నారు. భారత్ – రష్యా, చైనాలతో చేతులు కలపడం ద్వారా అమెరికా ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని అన్నారు. భారతదేశం అమెరికాతో స్నేహంతో కొనసాగకపోతే, రష్యా, చైనాతో ఇండియా పొత్తు కచ్చితంగా ఆ దేశానికి హాని కలిగిస్తుందని హెచ్చరించారు. ఇది భారతదేశానికి మంచిది కాదని స్పష్టంగా చెప్పారు.
READ ALSO: Maoist Chief India: మావోయిస్ట్ సెంట్రల్ చీఫ్ కుర్చీపై తెలంగాణ వ్యక్తి..