హైదరాబాద్ శివారులోని నర్సింగి మున్సిపాలిటీలో ఓ మహిళా అధికారిణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నర్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మణి హారిక మంగళవారం లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.