Narsingi Kidnap Case: హైదరాబాద్ లోని నార్సింగిలో ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన కేసులో మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీల కారణంగా వ్యాపారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కర్నూలుకు చెందిన శేషు వర్ధన్ రెడ్డి హైదర్‌షాకోట్‌లోని ఫోర్ట్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో కలిసి కాపురం ఉంటున్నాడు. శేషు వర్ధన్‌కు బంగారం, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఉన్నాయి. కర్నూలుకు చెందిన అందె క్రాంతికుమార్ తో శేషువర్ధన్‌కు ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు వచ్చాయి. శేషు వర్ధన్ క్రాంతికుమార్‌కి కొంత డబ్బు బాకీ ఉన్నాడు. అయితే డబ్బులు అడిగిన ప్రతిసారీ రేపు మాపూ అంటూ మాటదాటేస్తూ వచ్చాడు. దీంతో శేషు వర్ధన్ పై క్రాంతి కుమార్ కక్ష్య పెంచుకున్నాడు. అతడి నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని క్రాంతి కుమార్ నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే కిడ్నాప్‌కు తెరలేపాడు. అతడిని కిడ్నాప్ చేసి బెదిరించి డబ్బులు దండుకోవాలని ప్లాన్ చేశాడు. తన స్నేహితుడు కె.సందీప్ ని సహాయం కోరాడు.
Read also: Central Ministers: బీజేపీ నాయకత్వ మార్పులు మరియు కొత్త బాధ్యతలు ఎవరెవరికి..?
జూన్ 8న రాత్రి నార్సింగి రోటరీలో వ్యాపార భాగస్వామితో కలిసి కారులో వెళ్తున్న శేషువర్ధన్‌రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అప్పటికే కిడ్నాప్ చేసేందుకు కారులో దాక్కున్న క్రాంతికుమార్, సందీప్ కలిసి కారులో వేచి ఉన్నారు. శేషు వర్ధన్ రెడ్డి కారును అడ్డగించి, కారులో ఎక్కించి, అతనిని పిడిగుద్దులు కురిపించి, కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి స్థానిక సీసీ కెమెరాల సాయంతో కర్నూలు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. నార్సింగి పోలీసులు ఆ మార్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. మహబూబ్‌నగర్ పరిధిలోని అడ్డాకుల టోల్‌గేట్ వద్ద నిందితుడి కారును అడ్డాకుల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Hamas Israel Conflict: నలుగురు బందీల కోసం జరిగిన ఆపరేషన్‌లో 274 మంది మృతి..!